టీవీయాంకర్‌ చెంప చెళ్లుమనిపించిన పాక్‌ మంత్రి
close
Updated : 07/01/2020 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీయాంకర్‌ చెంప చెళ్లుమనిపించిన పాక్‌ మంత్రి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ చౌదరి  మరోసారి టీవీ యాంకర్‌ చెంప చెళ్లుమనిపించారు. ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ హరీమ్‌ షాతో తనకు సంబంధం అంటగట్టడంపై మండిపడుతూ ఓ వివాహ వేడుకకు వచ్చిన అతడిపై చేయిచేసుకున్నాడు. అంతే కాకుండా తన చర్యను సమర్థించుకున్నారు. ‘‘ పదవులు ఉండొచ్చు.. పోవచ్చు.. కానీ మనమంతా మనుషులం.  మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినపుడు స్పందిస్తాం. వ్యక్తిగత ఆరోపణలను సహించేది లేదు’’ అని తెలిపారు.

మరోవైపు యాంకర్‌పై మంత్రి చేయి చేసుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో.. ట్విటర్‌ వేదికగా ఆయన  స్పందించారు. యాంకర్‌ ముబాషెహర్‌ను నకిలీ జర్నలిస్టుగా వ్యాఖ్యానించారు. జర్నలిజం విలువలను ఇలాంటి వారు కాలరాస్తున్నారని చెప్పారు.  ఈ విషయాన్ని బహిర్గతం చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని ట్వీట్‌ చేశారు.

ఇటీవల ముబాషెహర్‌ నిర్వహిస్తున్న ఓ టీవీ కార్యక్రమంలో మరో యాంకర్‌ మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ స్టార్‌ హరీమ్‌షాతో మంత్రి చౌదరి అసభ్య వీడియోలను తాను చూశానని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముబాషెహర్‌పై చేయి చేసుకున్నారు. మంత్రి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.  గత జూన్‌లో ఓ ఛానల్‌ నిర్వాహకుడు షమి ఇబ్రహీంని కూడా కొట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని