నాన్న ఆస్తి అడగొచ్చా?
close
Published : 11/01/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న ఆస్తి అడగొచ్చా?

మా నాన్నగారికి నలుగురం సంతానం. నేనూ, చెల్లి... ఇద్దరు తమ్ముళ్లు. మావారు చనిపోయారు. నాకొక అబ్బాయి, అమ్మాయి. పాప పెళ్లి తర్వాత నేను అల్లుడి దగ్గరే ఉంటున్నా. 2018లో మా అమ్మాయి చనిపోయింది. మానాన్న స్కూల్‌ టీచర్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. ఆయన డిపెండెంట్‌గా నమోదు చేయించుకున్నా. అది ఇంకా ప్రాసెస్‌లో ఉంది. మా అమ్మానాన్న చనిపోయే ముందు ఎటువంటి వీలునామా రాయలేదు. నాన్న పేరు మీద ఒక ఇల్లు ఉంది. అది కోటి రూపాయల విలువ చేస్తుంది. తమ్ముళ్లిద్దరూ మాతో సంతకం చేయించుకుని దాన్ని పంచుకున్నారు. వారిద్దరికీ అక్కడే చెరొక ఇల్లుంది. ఇప్పుడు నన్ను చూసేవారు ఎవరూ లేరు. నేను ఆ ఆస్తి కోసం, ఆర్థికసాయం కోసం అడిగితే వారేం మాట్లాడటం లేదు. నేనిప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాను. న్యాయపరంగా నాకేమైనా సహాయం లభిస్తుందా?

-ఓ సోదరి

మీ తమ్ముళ్లు ఏ పేపర్‌ మీద మీతో సంతకం చేయించుకున్నారో తెలియజేయలేదు. మీ నాన్నగారి స్వార్జితానికి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే... అది పిల్లలందరికీ సమానంగా వస్తుంది. ఆయనకు ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలకు మీరు డిపెండెంట్‌గా ఉన్నారు. కాబట్టి మీకూ భాగం వస్తుంది. మీ నాన్న రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు ఆయనే తీసుకొని ఉంటే... అది ఆయన స్వార్జితం కాబట్టి తనకు ఇష్టం వచ్చిన వారికి ఇవ్వొచ్ఛు ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే అందరికీ సమాన భాగాలు వస్తాయి. డిపెండెంట్‌గా నమోదు చేయించుకున్నానని చెబుతున్నారు. అది ఎక్కడ ప్రాసెస్‌లో ఉందో చెప్పలేదు. అది తెలిస్తే మీకు ఉపయోగపడుతుందో లేదో చెప్పగలను. మీరు మీ తమ్ముళ్లకి రాసిచ్చిన కాగితం రిజిస్టర్డ్‌ కాకపోతే దానికి విలువ లేదు. ఈ విషయం స్పష్టంగా తెలిస్తే మీకు సరైన హామీ ఇవ్వగలను. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 ప్రకారం 2004కి ముందు మీ తమ్ముళ్లు ఆస్తి పంచుకోకుండా ఉంటే మీ అక్కాచెల్లెళ్లకీ అందులో సమాన వాటా ఉంటుంది. మీరు తప్పకుండా భాగస్వామ్య దావా వేసి భాగం అడగొచ్ఛు అందులో మీ నాన్నగారి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో వాటా, ఆస్తిలో భాగం రెండూ కలిపి అడగండి. ఒక వేళ మీతో రాయించుకున్న కాగితం రెలింక్విష్‌మెంట్‌ డీడ్‌ అయితే భాగం వదులుకున్నట్టు. సెటిల్‌మెంట్‌ డీడ్‌ అయితే దాన్ని రద్దు చేయమని, అది మోసపూరితంగా రాయించుకున్నదని కోరుతూ సూట్‌ దాఖలు చేయొచ్ఛు మీరు డిపెండెంట్‌గా రాయించుకున్న కాగితం సాక్ష్యంగా చూపించాల్సి ఉంటుంది. మీరు అనారోగ్యంతో ఉన్నానంటున్నారు. మీ సోదరులు మీ నాన్నగారి ఆస్తిని అనుభవిస్తున్నారు. కాబట్టి భరణం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయండి. సెక్షన్‌ 21, 22 హిందూ దత్తత, భరణం చట్టం ప్రకారం చనిపోయినవారి ఆస్తిని అనుభవిస్తున్నవారు వారి తల్లిని, తండ్రిని, పెళ్లి కాని కూతురిని, భర్త చనిపోయిన కూతురిని పోషించాల్సి ఉంటుంది. ముందుగా ఒక మంచి లాయర్‌ని సంప్రదించి ఆస్తులకు సంబంధించిన కాగితాలు చూపించి ముందుకు వెళ్లండి. ధైర్యంగా ఉండండి.

మీ ప్రశ్నలు vasulegal@eenadu.net కు పంపించగలరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని