కథలు చెప్పే గోరింట!
close
Published : 13/01/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథలు చెప్పే గోరింట!

పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలా వేడుక ఏదైనా చేతులకు మెహందీ ఉండాల్సిందే.... అంతలా మగువల అలంకరణలో భాగమైన మెహందీ జీవితంలోని మధుర స్మృతులని కూడా గుర్తుచేస్తే ఎలా ఉంటుంది?
ఇదే ఆలోచనని ఆచరిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ప్రత్యూష ఆచార్యభట్ట. చిన్నప్పటి నుంచి ప్రత్యూషకి మెహందీ పెట్టడం అంటే చాలా ఇష్టం. సరదాగా ఈ కళను అలవరచుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలకు మెహందీ పెట్టే స్థాయికి వెళ్లిందంటే తన కళలో ఏదో విశేషం ఉండే ఉండాలిగా. మనం పెట్టుకునే మెహందీ మన పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా...ఆ జ్ఞాపకాలు మన అరచేతిల్లో ప్రతిబింబించేలా చేయడమే ఆమె ప్రత్యేకత. మన మధున జ్ఞాపకాలను తనకు చెప్తే చాలు. అప్పటికప్పుడు ఆ రోజులను గుర్తుచేసేలా ఆ చుట్టు పక్కలున్న పరిసరాలతో సహా ఆ సంఘటనలను కళ్లకు కట్టేలా చిత్రీకరించేస్తుంది. ఇప్పుడీ అమ్మాయి మెహందీ పెడుతూ దక్షిణ భారతదేశం మొత్తం తిరిగేస్తుంది.

ఆరేళ్ల నుంచీ...
బీటెక్‌ పూర్తయిన తరువాత తనకు ఆసక్తి ఉన్న మెహందీ పెట్టడాన్నే వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. గత ఆరేళ్ల నుంచీ తన అభిరుచిని వ్యాపారంగా మార్చుకుంది. అన్నట్టు ప్రత్యూష పుట్టింది రాజమండ్రిలో. చదువుకుంది కోయంబత్తూరులో. ప్రస్తుతం విజయవాడలో ఉంటోంది.

- ఏనుగుల అశ్విని జ్యోతి, ఈజేఎస్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని