అధిక రుతుస్రావమా!
close
Published : 19/01/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధిక రుతుస్రావమా!

కొందరు మహిళలు అధిక రుతుస్రావ సమస్యతో బాధపడుతుంటారు. కొన్ని రకాల వ్యాయామాలు, ఆసనాలు, ముద్రల ద్వారా ఆ సమస్యను నియంత్రించవచ్చు...


సీతాకోకచిలుక (పక్షి ప్రక్రియ): కూర్చుని రెండు కాళ్లూ దగ్గరగా తీసుకోవాలి. అరిపాదాలను కలిపి రెండు చేతులతో పట్టుకోవాలి. రెండు మోకాళ్లను పైకీ కిందకూ సీతాకోకచిలుక రెక్కల్లా కదిలించాలి. ఇలా 50 నుంచి 100 సార్లు చేయాలి.


వ్యానముద్ర: సుఖాసనంలో కూర్చుని రెండు చేతులతో చూపుడు వేలును బొటనవేలు చివరతో కలపాలి. మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికెన వేళ్లను తిన్నగా ఉంచాలి. రెండు అరచేతుల వెనక భాగాన్ని మోకాళ్ల మీద ఆనించి ఉంచాలి. కళ్లు మూసుకుని ఈ ముద్రను పది నుంచి ఇరవై నిమిషాలు సాధన చేయాలి.


ప్రిష్టాసనం: ముందుగా నిలబడి రెండు పాదాల పక్కన రెండు చేతులను ముందుకు వంగి పెట్టాలి. కుడికాలిని వెనక్కి పెట్టి కాలి వేళ్ల మీద బరువు ఉంచాలి. ఎడమ మోకాలును 90 డిగ్రీల కోణంలో వంచి రెండు చేతులు పాదం పక్కన లోపలికి ఉంచాలి. రెండు మోచేతులు కింద ఆనించి ఉంచాలి. ఇలా 30 సెకన్లు ఉండాలి. ఇలాగే ఎడమకాలితో  చేయాలి.


చిట్కా: అధిక రక్తస్రావమవుతున్న సమయంలో తడి నూలు వస్త్రాన్ని పొత్తికడుపుపై వేసుకుని అరగంటపాటు పడుకోవాలి. ఇలా చేయడం వల్ల స్రావం తగ్గుముఖం పట్టడమే కాకుండా ఉపశమనం లభిస్తుంది.

-అరుణ, యోగా నిపుణురాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని