మరకను మాయం చేద్దామిలా!
close
Published : 30/01/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరకను మాయం చేద్దామిలా!

‘మరక మంచిదే’ అంటూ ప్రకటనల్లో చూపించినంత మాత్రాన వాటిని ఓ పట్టాన వదలగొట్టలేం. ఒక్కోరకం మరకకు ఒక్కో చిట్కా పాటించాలి. అవేంటో మీరూ చూసేయండి మరి.●

* పిల్లల దుస్తుల మీద ఇంకు మరకలు సహజం. వీటిని వదిలించాలంటే ఆ మరకపై కాసిన్ని పాలు పోసి వదిలేయండి. మరక పోతుంది. దానిపై కాస్త హెయిర్‌ స్ప్రేను చల్లి కాసేపాగి ఉతికినా మరకలు పోతాయి.●

* టమాటా రసం లాంటివి పడినప్పుడు ఆ మరకపై నేరుగా వైట్‌ వెనిగర్‌తో రుద్ది వెంటనే ఉతికేస్తే మరకలు పోతాయి. కూరగాయల మరకలు పడిన చోట వంటసోడా చల్లాలి. ఆ తరువాత సమాన పరిమాణాల్లో నీళ్లు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి ఆ ద్రవాన్ని దుస్తులపై స్ప్రే చేసి ఉతికితే సరి.●

* చెమట వల్ల దుస్తులపై మరకలు పడతాయి. వీటిపై నిమ్మతొక్కతో రుద్దితే మరక పోవడమే కాకుండా సువాసనలు వెదజల్లుతాయి.●

* నూనె, గ్రీజు మరకలు పడిన చోట చాక్‌పీస్‌తో రుద్దితే చాలు. సుద్దముక్క నూనెను పీల్చేస్తుంది. మరక పడిన చోట వంటసోడా చల్లాలి. ఇది నూనె, గ్రీజులను పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ దుస్తులను వైట్‌ వెనిగర్‌ వేసిన నీటిలో నానబెట్టి డిష్‌వాష్‌ బార్‌తో రుద్దితే సరిపోతుంది.●


* కాఫీ మరకలు పోవాలంటే ఆ ప్రాంతంలో కొద్దిగా వంటసోడా వేసి బాగా రుద్దాలి. లేదా మరక పడిన వెంటనే దానిపై కాసిన్ని వేడినీళ్లు పోయాలి.●


* రక్తపు మరకలపై కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ రాసి పావుగంటాగి శుభ్రం చేయాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని