తిరగలి పాటలని తిరిగి బతికిస్తూ...
close
Published : 30/01/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరగలి పాటలని తిరిగి బతికిస్తూ...

నాటేసినా... కలుపు తీసినా... తిరగలి తిప్పినా... ఇలా ఏ పని చేసినా ఒకప్పుడు పాటలు పాడుతూ చేసేవారు. ఆ పాటలతోనే... అలుపూసొలుపూ లేకుండా అలవోకగా పని పూర్తిచేసేవారు. బావా మరదళ్ల సరసాలు, పెళ్లి పాటలు, బతుకు పోరాటాలు, పురాణాలు, కష్టసుఖాలు, సంప్రదాయాలు... అన్నీ వాటిలో ఇమిడిపోయేవి. ఈ జానపద సాహిత్యం అంతా ఒక తరం నుంచి మరొక తరానికి మాటల ద్వారానే పరిచయం అయ్యేది. ఇలాగే గోవాలో కొంకణీ భాషలో తిరగలి తిప్పుతూ పాడే పాటలు ఉండేవి. క్రమంగా అవి కనుమరుగై పోతుండటంతో ఆచార్య హితా పండిత్‌, సరోజినీ బైవా గౌవ్కర్‌ వీటిని అక్షరీకరించేందుకు నడుం కట్టారు. పెద్దల దగ్గర, గ్రామాల్లో తిరిగి అలాంటి ఎన్నో పాటలను సేకరించారు. హితా ఇప్పటికే ఎనిమిది పుస్తకాలు రాసి, డాక్యుమెంటరీలు రూపొందిస్తోంది. ‘గ్రైండింగ్‌ స్టోరీస్‌, సాంగ్స్‌ ఫ్రం గోవా’ అందులో ఒకటి. సరోజిని ఈ సాహిత్యాన్ని సేకరించి వాటికి బాణీలు సమకూరుస్తోంది. తనే స్వయంగా పాటలు పాడి ఈ తరానికి తెలియజేస్తోంది. ఆమె ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. గోవా సముద్రతీరంలోని ఓ మారుమూల గ్రామం ఆమె స్వస్థలం. సరోజిని పాటలు తిరగలి తిరిగే రిథమ్‌కి సరిగ్గా సరిపోయేలా భలే వినసొంపుగా ఉంటాయి. వీరిద్దరూ ఇటీవల జరిగిన భాగ్యనగరి సాహితీ పండగలో పాల్గొన్నారు. ‘తిరగలి కథలు’ కార్యక్రమంలో పాడి అందరినీ ఆకట్టుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని