ఒత్తైన శిరోజాలకు...
close
Updated : 02/02/2020 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒత్తైన శిరోజాలకు...

జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దాని కోసం ప్రత్యేకమైన నూనెలనూ వాడుతుంటారు. ఈసారి మందారంతో నూనెను తయారుచేసుకుని ప్రయత్నించండి. తేడా మీకే తెలుస్తుంది.
ఒత్తయిన జుట్టుకు: స్వచ్ఛమైన కొబ్బరినూనెలో కొన్ని మందారపూలు, లెమన్‌గ్రాస్‌ ఆయిల్‌ వేసి వేడిచేయాలి. ఆ మిశ్రమం చల్లారాక రాత్రి పడుకునే ముందు కానీ స్నానం చేయడానికి అరగంట ముందుకానీ తలకు బాగా పట్టించి, మర్దన చేసుకోవాలి. ఇలాచేస్తే ఒత్తయిన జుట్టు మీ సొంతమవుతుంది.
జుట్టు మెరవాలంటే: మందారపూలు, కోడిగుడ్ల సొనను మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేస్తే వెంట్రుకలు మెత్తగా, పట్టులా మెరుస్తాయి.
చుండ్రు నివారణకు: మందార పువ్వులు, కొద్దిగా కలబంద రసం, చిన్న అల్లం ముక్క... ఈ మూడింటినీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని