ఎంతసేపుంటే అంతే!
close
Published : 07/02/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంతసేపుంటే అంతే!

దిక్సూచి

యాత్రకయ్యే ఖర్చులో సింహభాగం బసకే చెల్లించాల్సి వస్తుంది. హోటల్‌లో దిగగానే ‘రోజుకు ఇంత..’ అనే మాట వినిపిస్తుంది. అద్దె ఎక్కువైనా ఊరు కాని ఊరులో చేసేదేం లేక గదిలో దిగుతారు. ఉదయం స్నానపానాదులు పూర్తయ్యాక హోటల్‌ గది నుంచి బయటకు వస్తే.. విహారమంతా పూర్తయి వెళ్లే సరికి ఏ రాత్రో అవుతుంది. రోజంతా గదిలో లేకున్నా.. అద్దె మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందే! ఈ సమస్యకు పరిష్కారం చూపారు హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌రెడ్డి గుర్రాల. శరత్‌, నిహాల్‌ రెడ్డి, మేఘనా కొలన్‌ బృందంతో కలిసి పర్యాటకులకు ఉపయుక్తంగా ఉండేలా పోబైట్‌ (pobyt) యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ సాయంతో మీకెంత సమయం కావాలంటే అంతసేపే గది బుక్‌ చేసుకోవచ్ఛు గదిలో ఉన్నంత సమయానికే అద్దె చెల్లించొచ్ఛు కనీసం మూడు గంటలు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగైదు గంటలు బుక్‌ చేసుకొని.. అవసరాలు తీర్చుకొని మళ్లీ విహారానికి వెళ్లిపోవచ్ఛు పోబైట్‌ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి త్వరలో చెన్నైతో పాటు మరిన్ని పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. విహారంలోనే కాదు.. అత్యవసరంగా ఏదైనా పార్టీకి వెళ్లాల్సి వస్తే తయారవ్వడానికీ, విశ్రాంతి తీసుకోవడానికీ పోబైట్‌లో గదులు బుక్‌ చేసుకోవచ్ఛుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని