వేసవినోదపు టూరు!
close
Updated : 14/02/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేసవినోదపు టూరు!

‘బండిలో పెట్రోల్‌.. గుండెలో ఉత్సాహం ఉండాలేగానీ ఎంతదూరమైనా వెళ్లడానికి మేం రెడీ’ అనే రైడర్ల సంఖ్య పెరిగిపోతోంది. మిగతా సమయాల్లో సరే.. వేసవిలో లాంగ్‌టూర్లకు గడ్డుకాలమే. మండే ఎండల్లో వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరి కాకుండా బైకర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
*ఎక్కువసేపు ఎండలో ఉంటే డీహైడ్రేషన్‌కి గురవుతుంటారు. దాహం తీర్చుకోకుండా ముందుకెళ్లిపోతుంటే వడదెబ్బ తగిలే ప్రమాదముంది.  బైక్‌పై వెళ్లే ప్రతిసారీ ఒకట్రెండు లీటర్ల వాటర్‌ బాటిల్‌ వెంట ఉంచుకోవాలి.
* ఎండ ఎక్కువగా ఉంటే రైడింగ్‌ గ్లౌజులు, కాళ్లకి సరైన బూట్లు లేకుండా ప్రయాణం చేయొద్దు. కాళ్లూ చేతులూ మంటెత్తిపోతుంటే రైడింగ్‌ ఏకాగ్రతతో చేయలేం. సౌకర్యవంతంగానూ ఉండదు

* దూరప్రయాణాల్లో రైడింగ్‌ జాకెట్‌కన్నా చిన్న సైజు టీషర్టులు ధరించాలి. ఇవి ఉక్కపోతను నివారిస్తాయి. ఒంటిపై తేలిగ్గా ఉంటాయి

* చేరాల్సిన గమ్యం, ఆగాల్సిన స్టాప్‌లపై స్పష్టత, సరైన ప్రణాళిక ఉండాలి. మూణ్నాలుగు గంటలకోసారైనా విశ్రాంతి తీసుకోవాలి. నాన్‌స్టాప్‌ ప్రయాణంతో వెన్నెముక, పిరుదులు నొప్పెడతాయి. కూర్చునే విధానంలో తేడాలొస్తాయి

* ఇంజిన్‌ బాగా వేడెక్కితే చల్లబడటానికి కొద్దిసేపు బండి ఆపాలి. ఓవర్‌హీట్‌ అయినప్పుడు అలాగే ప్రయాణం చేస్తుంటే ఇంజిన్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే దాని జీవితకాలమూ తగ్గుతుంది.
* టూరు ప్రారంభానికి ముందే టైర్‌ ప్రెషర్‌, ఆయిళ్లు, కూలంట్‌లు సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్‌ చేసుకోవాలి. గాలి పరిమాణం సరిగా లేకపోతే టైర్లు వ్యాకోచం చెంది పేలిపోయే అవకాశాలెక్కువ.
* దారి స్పష్టంగా కనపడేలా, మొహంపై ఎండ పడకుండా.. ప్రయాణంలో లేతరంగులో ఉండే టింటెడ్‌ హెల్మెట్‌లు ధరించాలి. అయితే రాత్రివేళల్లో ఇవి అంత స్పష్టంగా ఉండవు. దానికి బదులు ప్రత్యామ్నాయ హెల్మెట్‌, సన్‌గ్లాసులు అందుబాటులో ఉంచుకోవాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని