ఆ తిరస్కారాలు ఇప్పుడు ప్రభావం చూపుతాయా?
close
Updated : 19/02/2020 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ తిరస్కారాలు ఇప్పుడు ప్రభావం చూపుతాయా?

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికా యానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...


నా విద్యార్థి వీసా దరఖాస్తు రెండుసార్లు తిరస్కరించారు. మరో విశ్వవిద్యాలయం నుంచి ఐ-20 లభించింది. ఆ రెండు తిరస్కారాలు నా భవిష్యత్తు ఇంటర్వ్యూపై ప్రభావాన్ని చూపుతాయా?

- రాజారామ్మోహన్‌ సీవీ

 

జ: దరఖాస్తు చేసుకున్న వీసా విభాగానికి అభ్యర్థి అర్హుడా? కాదా? అన్నది ఇంటర్వ్యూ అధికారి స్థూలంగా పరిశీలిస్తారు. అమెరికాలో ఆ కోర్సును పూర్తి చేసేందుకు అవసరమైన విశ్వసనీయ ప్రణాళికను, ఫీజుల చెల్లింపునకు చాలినంత మేరకు నిధులు ఉన్నట్లు నిరూపించుకోవాలి. చదువు పూర్తి చేసుకున్న మీదట మాతృదేశానికి తిరిగి వస్తానని స్పష్టం చేయాల్సి ఉంటుంది. మరోసారి దరఖాస్తు చేయమని మేము సూచించం. మునుపటి తిరస్కారానికి మించిన విశ్వసనీయ సమాచారం ఉందని భావించిన పక్షంలో దరఖాస్తు చేసుకోవచ్చు.


* వీసాలకు సంబంధించిన నిర్ద్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను  support-india@ustraveldocs. ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర  సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.


నా హెచ్‌1బి వీసా దరఖాస్తు పెండింగులో ఉంది. దాన్ని పరిష్కరించేందుకు ఎంత సమయం పడుతుంది?

- రుక్మిణీ సాగర్‌

 

జ: దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకు పరిపాలనా ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేం. జరుగుతున్న జాప్యం మిమ్మల్ని ఎంత ఆవేదనకు గురి చేస్తుందో అర్థం చేసుకోగలం. సాధ్యమైనంత త్వరితంగా ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. వ్యక్తిగతంగా సమాచారం తెలుసుకోవాలంటే support-india@ustraveldocs.com కు రాయండి. మీ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు  https://ceac.state.gov/ceac/  తరచూ పరిశీలించండి.


నాకు ఎఫ్‌-1 వీసా మంజూరు అయింది. ఈ విద్యా సంవత్సరానికి హాజరు కాలేకపోతున్నాను. నూతన వీసా కోసం దరఖాస్తు చేయాలా? ఆ వీసా చెల్లుబాటు అవుతుందా?

- నరేంద్రకుమార్‌ సామర్లకోట

 

జ: అయిదు నెలల కిందట జారీ చేసిన ఎఫ్‌-1 వీసా అయినా, ఎస్‌ఈవీఐఎస్‌ నంబరు, విద్యా సంవత్సరంలో మార్పు లేకపోయినా, విశ్వవిద్యాలయంలో మార్పులేకపోయినా ప్రస్తుత వీసాపై అమెరికా వెళ్లవచ్చు. ఐ-20 పేర్కొన్న తేదీకి 30 రోజుల ముందుగా మాత్రమే అమెరికాలో ప్రవేశించేందుకు విద్యార్థి వీసాదారులకు అర్హత ఉంటుందన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. వీసా ఉన్నా అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తుంది. నిర్ధారిత తేదీలోగా ఎందుకు అమెరికా రాలేదని ప్రవేశ ప్రాంతంలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.


డిపెండెంట్‌ వీసాపై భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నాను. అమెరికాలో ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాను. నా వీసాను బదలాయించుకునేందుకు అవకాశం ఉందా?

- నళినీ రవికాంతన్‌

 

జ: హెచ్‌-4 లాంటి డిపెండెంట్‌ వీసాలపై ఉండేవారు అమెరికాలో ఉన్నత విద్యను ఆ వీసాపై చదువుకోవచ్చు. ఎఫ్‌-1 వీసా హోదాలో కూడా చదువుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://www.uscis.gov/ ను చూడండి.


- ఈనాడు, హైదరాబాద్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని