ఉపవాసం ముగిశాక...
close
Updated : 21/02/2020 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపవాసం ముగిశాక...

పండగంటే ఒక పనా... ఇంటిల్లిపాదీ అవసరాలు చూస్తూనే.. మరోపక్క బోళా శంకరుడైన శివుడుని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఒక్కపొద్దు కూడా చేస్తాం. ఈ శ్రమంతా మనమే పడాలి కాబట్టి ఉపవాసం తర్వాత ఒక్కసారిగా నీరసించి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలుసుకుందాం..
కొన్ని గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని ఉపవాసం అంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఎక్కువ గంటలు తినకుండా ఉండి... కొన్ని గంటల్లో మాత్రమే నచ్చిన ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. కొవ్వు నిల్వలు తగ్గుతాయి. శరీరంలోని నిరుపయోగ కణాలను విచ్ఛినం చేసే ప్రక్రియ మెరుగవుతుంది.  
* ఉపవాసం ముగిసిన తరువాత సాత్విక ఆహారం తీసుకోవాలి. సహజంగా పోషకాలు అందే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో శరీరానికి పోషణ, శక్తినిచ్చే పండ్లు, పాలు తీసుకోమని చెబుతారు. ఎక్కువ గంటలు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వల్ల శరీరం అలసిపోతుంది. దానికి కావాల్సిన శక్తిని పోషణను సహజ పదార్థాల ద్వారా అందించాలి.
* ఉపవాసం వల్ల వచ్చిన అలసట త్వరగా పోవాలంటే చక్కటి ప్రత్యామ్నాయం పండ్లను తినడమే. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పండ్లలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. సాధారణంగా అన్ని పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేట్‌ కాకుండా తాజాగా, తేమగా ఉంటుంది. పండ్ల నుంచి పొటాషియం, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియంట్స్‌ లభిస్తాయి. ఇవన్నీ తేలికగా జీర్ణమవుతాయి. జీర్ణాశయంపై ఒత్తిడి పెంచవు. ఈ పర్వ దినం రోజు తీసుకునే చిలగడదుంపల్లో తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఉంటాయి. ఖర్జూరం, బెల్లం నుంచి ఎక్కువ మొత్తంలో చక్కెర, ఇనుము లభిస్తుంది. వీటిని తీసుకుంటే త్వరగా శక్తి లభిస్తుంది. ఈ పదార్థాలన్నీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగించవు. పాలు శరీరానికి బలాన్నిస్తాయి.

జానకీ శ్రీనాథ్‌, పోషకాహార నిపుణులుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని