నా నవ్వులో నువ్వున్నావమ్మా...
close
Updated : 09/06/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా నవ్వులో నువ్వున్నావమ్మా...

‘నా గుండె నిత్యం భారంగా ఉంటుంది’... హృదయవేదన నిండిన ఈ అక్షరాలు మరెవరివో కాదు. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ జాహ్నవి రాసినవి. మూడు దశాబ్దాలపాటు తన నటన, అందంతో భారత సినీరాజ్యాన్ని పాలించిన మకుటం లేని మహారాణిగా నిలిచింది శ్రీదేవి. అభిమానుల గుండెల్లో వేదనను మిగిల్చి సుదూరతీరాలకు వెళ్లిపోయి, అప్పుడే రెండేళ్లు అయ్యాయి. ఆమె వర్థంతిని పురస్కరించుకుని జాహ్నవి తన మనసులోని భారాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తల్లిఎడబాటుతో తన మనసులో నిండిన వేదనతోపాటు, ఆమెతో పంచుకున్న చిన్నప్పటి మధురక్షణాలను ఫొటోల రూపంలో పొందుపరిచింది. దూరమైన ఆమె ప్రేమ, అనుబంధం తనను ఎంతటి వ్యధకు గురిచేస్తోందో.. ఆ భావాన్ని అక్షరాలుగా మార్చి ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

అమ్మా...

నీ జ్ఞాపకాలతో నా గుండె నిండిపోయి, నిత్యం భారంగా ఉంటుంది. అయినా నా పెదాలపై చిరునవ్వు చెదరకుండా చూసుకుంటా. ఎందుకంటే...ఆ నవ్వులో నిండి ఉండేదంతా నువ్వే. అందుకే నిత్యం నవ్వుతూ ఉంటా. అప్పుడే ప్రతిక్షణం నువ్వు నాతో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఎప్పటికీ నా ముఖంపై చిరునవ్వును చెరగనివ్వను. నువ్వు వదిలివెళ్లిన తరువాత ప్రతి రోజూ నువ్వు లేని లోటు తెలుస్తోంది. అమ్మా... నిన్ను నేను నిత్యం మిస్‌ అవుతూనే ఉన్నా. ఈ లోటు ఎప్పటికీ తీరనిది.


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని