ఈ చెవిపోగులు... కళ్లలో కారం కొడతాయి!
close
Published : 01/03/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ చెవిపోగులు... కళ్లలో కారం కొడతాయి!

చెవులకు వేలాడే జుంకాలు అందాన్నిస్తాయి. శ్యామ్‌ చౌరాసియా తయారుచేసిన చెవిపోగులు అందంతోపాటు భద్రతని కూడా ఇస్తాయి. అదెలా అంటే...

వారణాసికి చెందిన శ్యామ్‌ చౌరాసియా మహిళల భద్రత కోసం కొత్తరకం చెవి దిద్దులను తయారుచేశాడు. ఆకతాయిల నుంచి ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఈ చెవిపోగులకు వెనుక ఉండే మీటను నొక్కితే సరి. దాన్నుంచి కారం బయటకొచ్చి తాత్కాలికంగా ఆకతాయిల నుంచి రక్షణ దొరకడంతోపాటు... పోలీసులకు కూడా సమాచారం వెళ్లిపోతుంది. వారణాసిలోని అశోకా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి శ్యామ్‌ చౌరాసియా దీన్ని తయారుచేశారు. ఈ చెవి దిద్దుల బరువు 45 గ్రాముల వరకూ ఉంటుందట. వీటి ధర రూ.450. మరో విశేషమేమిటంటే శ్యామ్‌ ఇంతకు ముందే మహిళల కోసం స్మార్ట్‌ పర్సు, లిప్‌స్టిక్‌ గన్‌ని కూడా తయారుచేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని