నిద్రకు శక్తిముద్ర
close
Updated : 01/03/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిద్రకు శక్తిముద్ర

పని ఒత్తిడి, ఆందోళన, వ్యక్తిగత సమస్యలు... ఇలా కారణాలు ఏవైనా నిద్రపట్టక ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇటువంటివారు భ్రామరీ ప్రాణాయామం, శక్తిముద్రలను ప్రయత్నించి హాయిగా నిద్రపోవచ్ఛు....

భ్రామరీ ప్రాణాయామం

సుఖాసనంలో వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చుని రెండు చేతుల బొటనవేళ్లతో చెవులు మూసి ఉంచాలి. చిటికెన, ఉంగరం, మధ్యవేళ్ల చివర్లతో కళ్లు మూయాలి. మరీ గట్టిగా మూయకూడదు. చూపుడు వేలును కనుబొమలపైన పెట్టాలి. మెల్లిగా శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఉమ్‌... అని శబ్దం చేస్తూ శ్వాస వదలాలి. ఇలా పది నుంచి ఇరవై సార్లు చేయాలి. తర్వాత శక్తి ముద్ర చేసి పడుకోవాలి. రెండూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్ఛు రెండు మూడు రోజుల్లోనే మార్పును గమనించవచ్ఛు


ముద్రతో..

సుఖాసనంలో వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. రెండు చేతుల చూపుడువేళ్లు, మధ్యవేళ్లు మడవాలి. వాటి మీద బొటనవేలు మడిచి పెట్టాలి. ఉంగరం వేళ్లు, చిటికెన వేళ్ల చివరలు కలిపి ఉంచాలి. రెండు చేతులు నాభికి పైన ముందుగా ఉంచాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. దీని వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. పడుకునే ముందు కూర్చుని ఈ ముద్ర చేయాలి. ఇది చేశాక వెంటనే అలాగే పడుకోవాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. తిన్న మూడు గంటల తర్వాత చేయాలి. మధ్యలో మెలకువ వస్తే మళ్లీ ఈ ముద్ర వేస్తే వెంటనే నిద్రపడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని