వర్ణమా వందనం!
close
Published : 05/03/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్ణమా వందనం!

ఈనెల 9 హోలీ

రంగు రంగులో కళ... ప్రతి రంగుకో లక్ష్యం, ఓ అవసరం ఉన్నాయి. అవి మనిషి ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి కూడా కారణమవుతాయి. అందుకే మనిషి ప్రకృతిలోని వర్ణాలను చూసి పరవశమవుతాడు, ఉత్తేజం పొందుతాడు. ఆ రంగుల్లోని దైవత్వానికి ప్రణమిల్లుతాడు. ●

* సృష్టిలోని అన్నీ శూన్యంలోంచే ఉద్భవిస్తున్నాయి. అందుకే అన్ని రంగులకూ నలుపును మూలంగా భావిస్తారు. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది.

* అత్యంత ప్రశాంతతకు, అత్యున్నత తాత్త్వికతకు తెలుపు నిదర్శనం. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుందని చెబుతారు.●

* సృష్టికి రజోగుణమే కారణం. అలాంటి రజోగుణానికి ఎరుపు సూచిక. అందుకే ఈ రంగును సృజనాత్మతకు నిదర్శనంగా భావిస్తారు.●

* నీలిరంగు దివ్యత్వానికి నిదర్శనం. ఇది ఏకాగ్రతను కుదుర్చుతుందని చెబుతారు. గాఢమైన, ప్రశాంతమైన మనస్థితికి ఇది కారణమవుతుందంటారు. రుషులు

* తపోస్థలిగా అడవులను, పచ్చటి ప్రాంతాలను ఎంచుకోడానికి కారణం ఆకుపచ్చ రంగు. ఇది ఎదుగుదలకు చిహ్నం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని