వీటినీ పట్టించుకోండి!
close
Published : 05/03/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీటినీ పట్టించుకోండి!

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే... అలర్జీలు, జలుబు, తుమ్ముల నుంచి అంతగా రక్షణ లభిస్తుంది. ఇంతకీ ఇంట్లో అలర్జీలుకలిగించేవి ఏంటో చూద్దాం....
వారానికి రెండుసార్లు
ప్రతి ఇంట్లో గడపకు అవతలి వైపో, ఇవతలి వైపో కాళ్లు తుడుచుకునే డోర్‌మ్యాట్లు ఉండటం మనం చూస్తుంటాô. వీటి నిండా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా పేరుకుపోయింటాయి. చాలామంది వీటిని రోజుల తరబడి శుభ్రం చేయకుండా అలానే వాడేస్తుంటారు. కానీ వీటిని తరచూ శుభ్రం చేయాలి. వారంలో రెండుసార్లు ఉతకాలి. లేదా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో రోజు మార్చి రోజూ క్లీన్‌ చేయాలి.
15 రోజులకోసారి
సంవత్సరాల తరబడి పరుపుపై నిద్రపోతాం కానీ... దానిని శుభ్రం చేయడంపై ఏ మాత్రం దృష్టి పెట్టం. పరుపులపై మన చర్మమృతకణాలు, తల్లోని చుండ్రుతోపాటు దుమ్ము, ధూళి పేరుకుపోతుంటాయి. ఇవే అనేక రకాల అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమవుతాయి. అలాగే దిండ్లు, పరుపులను తరచూ శుభ్రం చేస్తుండాలి. బెడ్‌షీట్స్‌, దిండు కవర్లను వారంలో ఒకట్రెండుసార్లు ఉతకాలి.  మ్యాట్రస్‌ కవర్లను పదిహేను రోజులకోసారి శుభ్రం చేయాలి.

మూడునెలలకోసారి
ఎండలు మొదలయ్యాయి కదా... ఇక ఏసీలు ఆన్‌ చేస్తారు. ఏసీలు వాడుకోవడమే కానీ వాటిని శుభ్రం చేయాలన్న స్పృహే ఉండదు చాలామందికి. ప్రతి మూడు నెలలకోసారి ఎయిర్‌ కూలర్లు, ఏసీలోని ఫిల్టర్లని మార్చాలి. ఇలా చేస్తే ఇంట్లో దుమ్ము పేరుకుపోదు. దగ్గు, జలుబు వంటివి రావు.
వారానికోసారి
గదులని వారానికోసారైనా పూర్తిగా శుభ్రం చేయాలి. ఎక్కువగా వాడుకునే ఇంటి పరిసరాలను రోజూ శుభ్రం చేయాల్సిందే. చీపురు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు దుమ్మును తరిమేసే ఆయుధాలుగా ఉపయోగపడతాయి.
చెప్పులు/ బూట్లు
వీటివల్లే దాదాపు ఎనభైశాతం దుమ్మూధూళి ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వీటిని గుమ్మం బయట వదలడం అలవాటు చేసుకోవాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని