ఈ ఆహారం పాస్‌ చేస్తుంది!
close
Published : 12/03/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఆహారం పాస్‌ చేస్తుంది!

పరీక్షలంటే విద్యార్థుల్లో ఆందోళన సహజమే.. చదువుకున్నవన్నీ జ్ఞాపకం ఉంటాయో లేదో అని భయపడుతుంటారు.. పాఠాలను ఓ ప్రణాళిక ప్రకారం చదువుకోవడంతోపాటు ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే పరీక్షలను విజయవంతంగా ముగించొచ్ఛు మంచి మార్కులనూ సాధించొచ్ఛు..

పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. దీనికి మానసిక ప్రశాంతత, మంచి నిద్ర అవసరమవుతాయి. చదివిందంతా జ్ఞాపకం ఉంటేనే విద్యార్థులు పరీక్షలు రాయగలరు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ప్రశాంతతని, ఏకాగ్రతని పెంచే సాత్వికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, నెయ్యి, మొలకలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు... ఈ తరహా ఆహారం కిందకు వస్తాయి. ఇవన్నీ శరీరాన్ని శ్రమపెట్టకుండా తేలికగా జీర్ణమవుతాయి. శరీరంలో మలినాలను పేరుకోనివ్వవు. అప్పుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. మజ్జిగ, నిమ్మరసం, చెరకు రసం, కొబ్బరినీళ్లు వంటివి తాగాలి.

వీటికి దూరంగా ఉండాలి...

పులుపు, అధిక ఉప్పు, మితిమీరిన కారం, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, కాఫీ, టీ వంటివాటికి దూరంగా ఉండాలి. చక్కెరతో తయారయ్యే తినుబండారాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ తరహా ఆహారం మనసును స్థిమితంగా ఉంచకుండా, కోపం, చిరాకు వంటి గుణాలను పెంచుతుంది. అందుకే వీటిని వీలైనంత తగ్గించుకుంటే మంచిది. ఎండిన వంటకాలు, చిప్స్‌, పులిసినవి, నిల్వ ఉంచిన ఆహారాలు, శీతలీకరించినవి, మాంసాహారం వంటివన్నీ తమో గుణాన్ని పెంచుతాయి. వీటిని తీసుకుంటే మత్తు, నిద్ర ఆవరించి... బద్ధకంగా అనిపిస్తుంది. చదివే పాఠాలు మెదడులో నిక్షిప్తమవ్వవు. అలాగే పిండివంటలు, స్వీట్లకు దూరంగా ఉండాలి.

నూనెతో మర్దన...

మాడుపై కొద్దిగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మర్దన చేస్తుంటే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది.

మూలికలతో...

తులసి, బ్రాహ్మీ, శంఖుపుష్ప, అశ్వగంధ వంటి మూలికలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత పెరగడానికి తోడ్పడతాయి.

10-15 తులసి ఆకులు, యాలకులపొడితో టీ కాచి తీసుకుంటుంటే ఒత్తిడి తగ్గుతుంది. కప్పు గోరువెచ్చని పాలు, అరచెంచా అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకున్నా చాలు.

చెంచా బ్రాహ్మీ చూర్ణం, కొద్దిగా పటికబెల్లం చూర్ణం, నెయ్యి కలిపి రెండుపూటలా తీసుకోవాలి. శంఖుపుష్ప చూర్ణం లేదా రసాన్ని రెండుపూటలా తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు సాత్వికాహారాన్ని అందిస్తూ, వారితో వ్యాయామాలు, ఆసనాలూ వేయించాలి.

* మీ ప్రశ్నలు vasuayur@eenadu.net కు పంపించగలరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని