జెడ్‌ కేటగిరీతో జాగ్రత్త!
close
Published : 18/03/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జెడ్‌ కేటగిరీతో జాగ్రత్త!

స్కూళ్లు బంద్‌...పిల్లలంతా ఇంట్లోనే! ఆటలు, పాటలు, ఆనందాలు...కేరింతలు ఇదోరకం! వీడియోగేమ్స్‌, మొబైల్‌కి అతుక్కుపోయి ఉండటం అదోరకం! ఈ జనరేషన్‌ పిల్లల తీరే వేరు. చొచ్చుకొచ్చిన సాంకేతికత తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ రోజుల్లో
జనరేషన్‌ జెడ్‌ పిల్లల విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో!

ఇప్పటికే టెక్నాలజీలో నిమగ్నమైన తల్లిదండ్రులను జనరేషన్‌ ఎక్స్‌, వై అని, తరువాతి తరం వారిని మిలీనియల్స్‌, ఈ దశాబ్దంలో పుట్టిన వారిని జనరేషన్‌ జెడ్‌ అని సంబోధిస్తున్నారు టెక్నాలజీ ప్రియులు.

సాంకేతికత.. మనల్ని ప్రపంచంతో అనుసంధానిస్తుంది. కానీ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మీకు తెలుసా! నిత్యం వారు వాడే ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, వైఫై వంటి వాటి నుంచి వెలువడే రేడియేషన్‌.. చిన్నారి మనసులను ప్రభావితం చేస్తుంది. పుట్టినప్పటి నుంచీ పెరిగి పెద్దవాళ్లయ్యే వరకు వారిపై ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. రోజురోజుకీ ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ‘జనరేషన్‌ జెడ్‌’ పిల్లల పెంపకంలో కొత్తగా ఎలాంటి అంశాలపై దృష్టి సారించాలో చూద్దామా...
ఈ జాగ్రత్తలు పాటించండి
* సెల్‌ఫోన్‌ను ఆట వస్తువుగా పరిగణించొద్దు. చిన్నప్పటి నుంచే పిల్లలు ఫోన్‌ వాడే సమయాన్ని పరిమితం చేయాలి. అవసరమనుకుంటే చదువుకు సంబంధించిన వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి, ఫోన్‌ ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టిన తరువాతే వారికి ఇవ్వాలి.
* వైఫై వాడకంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. అవసరమైనప్పుడే వైఫైను స్విచ్‌ ఆన్‌ చేసుకోవాలి. ఎక్కువ రోజులు వాడనప్పుడు రౌటర్‌ స్విచ్‌ఆఫ్‌ చేయాలి.
* ఎలక్ట్రానిక్‌ వస్తువులను, గ్యాడ్జెట్లను పడకగదికి దూరంగా ఉంచాలి. ఫోన్‌లలో అలారం పెట్టి పక్కన్నే పెట్టుకొని నిద్రించకూడదు. అలారం కోసం ప్రత్యేగ గడియారం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
* ప్రయాణాల్లో ఉన్నప్పుడు, సిగ్నల్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు పిల్లలకు ఫోన్‌ ఇవ్వకూడదు. అవసరమైతే ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టి ఇవ్వాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ కాకుండా, ఫోనులో డౌన్‌లోడ్‌ చేసిన ఆఫ్‌లైన్‌ గేమ్స్‌ ఆడోకోమని చెప్పాలి.
* ల్యాప్‌టాప్‌ను టేబుల్‌ లేదా డెస్క్‌పైనే పెట్టి వాడాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలు వాటిని ఒళ్లో పెట్టుకోకుండా చూడాలి. ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్లు, ఇతర డివైజ్‌లను వైర్‌లెస్‌ కనెక్షన్‌తో కాకుండా నేరుగా వైరుతో కనెక్ట్‌ చేస్తే రేడియేషన్‌ ప్రభావం తగ్గే అవకాశం ఉంది.
* ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ వంటివి ఏస్థాయిలో రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయో తెలుసుకోవాలి. వాటిని పిల్లలకు ఇచ్చినప్పుడు రేడియేషన్‌ కంట్రోలింగ్‌ చిప్స్‌ను అతికించి ఇవ్వడం మంచిది.

ఆటపాటలు లేవు...
గత దశాబ్దంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పిల్లల పెంపంకంలోనూ మార్పులు వచ్చాయి. సెల్‌ఫోన్‌ లేనిదే చిన్నారులు భోజనం చేయని పరిస్థితులు వచ్చాయి. ఆటపాటలను వదిలేసి ఫోన్‌, టీవీ, కంప్యూటరు ముందు కూర్చుంటున్నారు. తల్లిదండ్రులూ తమ పనుల్లో నిమగ్నమై ‘స్మార్ట్‌’ పెంపకమే ఉత్తమం అని భావిస్తున్నారు. మరోపక్క గ్యాడ్జెట్ల వాడకం కారణంగా కార్సినోజెన్‌, లెడ్‌, ఆస్బెస్టాస్‌ వంటి హానికారకాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
గ్యాడ్జెట్లతో భద్రం...
పిల్లల్లో పుర్రె నిర్మాణం పెద్దవాళ్లతో పోలిస్తే సున్నితంగా ఉంటుంది. దీంతో ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నారుల మెదడు, కళ్లు, ఎముక మజ్జ, ఇతర అవయవాలు అభివృద్ధి చెందే దశలో ఉండటమే ఇందుకు కారణం. గర్భంతో ఉన్న మహిళలూ దీని బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలే పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌, భావవ్యక్తీరణ లోపాలు, సామాజిక, ప్రవర్తనాపరమైన సమస్యలకు దారితీస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని