ఐదు అద్భుతాలు
close
Published : 22/03/2020 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు అద్భుతాలు

శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏదో ఒకటి తినడం కాదు... ఈ అయిదూ తినండి. వ్యాధుల నుంచి వీలైనంత దూరంగా ఉండండి...


ఈ ఐదు ఉన్నాయా?

విటమిన్‌ ఎ

పోషకవిలువలు సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఎ... వ్యాధులను దరిచేరనివ్వదు. కణాల అభివృద్ధి, వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం దీనికి ఉంటుంది. కంటిచూపు మందగించకుండా చూస్తుంది.
ఇవి తినండి: నారింజపండ్లు, తాజా కాయగూరలు, ముదురాకుపచ్చ వర్ణంలో ఉండే ఆకుకూరలు, బొప్పాయి, క్యారెట్‌, బ్రకోలీ, చిలగడదుంప, గుమ్మడికాయల్లో విటమిన్‌ ఎ ఉంటుంది.


సెలీనియం

బ్యాక్టీరియాతో పోరాడే సహజసిద్ధమైన శక్తిని సెలీనియొం మన శరీరంలో అభివృద్ధి చేస్తుంది.
ఇవి తినండి: నట్స్‌, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి, బ్రకోలీ నుంచి ఇది అందుతుంది.


జింక్‌

ది వ్యాధినిరోధకశక్తిని పెంచే ఖనిజం. వైరస్‌లతో పోరాడి, వ్యాధికారకాలను పునాది నుంచి పెకిలించే గుణం జింక్‌కు ఉంది. రక్తాన్ని శుద్ధి చేసి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇవి తినండి: గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుడ్డు పచ్చసొన, చేపల నుంచి జింక్‌ లభ్యమవుతుంది. ఇవి రోజూ తగిన మోతాదులో ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


విటమిన్‌ సి

వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా అందించే విటమిన్‌ ఇది. యాంటీఆక్సిడెంట్లు ఉండే విటమిన్‌ సి, శరీరాన్ని అనారోగ్యాల నుంచి రక్షణకవచంలా కాపాడుతుంది. ఒత్తిడి, ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు శరీరానికి శక్తిని అందిస్తుంది. వైరస్‌, బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యాలకు చెక్‌ పెడుతుంది.
ఇవి తినండి: ఆకుకూరలు, తాజా కూరగాయలు, నిమ్మజాతి పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, మామిడిపండు, క్యాబేజీ, కివీ నుంచి విటమిన్‌ సి లభ్యమవుతుంది.


విటమిన్‌ డి

సూర్యరశ్మి ద్వారా పొందగలిగే విటమిన్‌ డి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వైరస్‌, బ్యాక్టీరియాలను దరిదాపులకు రానివ్వదు. శరీరంలోని మలినాలను తొలగించి, అధిక కొవ్వును నివారిస్తుంది.
ఇవి తినండి: గుడ్లు, కాలేయం, చేపలు, వెన్న నుంచి ఇది శరీరానికి అందుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని