కురులుమెరవాలంటే..
close
Published : 27/03/2020 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కురులుమెరవాలంటే..

సౌందర్యం

జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం ఈ చిట్కాలను పాటించి చూడండి.

కొబ్బరిపాలతో...

పావుకప్పు కొబ్బరిపాలలో రెండు చెంచాల ఆలివ్‌ నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున కొన్ని వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది.

మెరవాలంటే..

జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే.. అరటిపండును మెత్తగా చేసి దాంట్లో కొంచెం పెరుగు కలపాలి. కావాలంటే కాస్త తేనెను కూడా కలపొచ్ఛు దీన్ని తలకు పట్టించి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే శిరోజాలు పట్టులా మెరుస్తాయి.

పోషణకు..

సరైన పోషణ అందక జుట్టు రాలిపోతుంటే.. గుడ్డుసొనలో చెంచా తేనె, కొద్దిగా ఆలివ్‌ నూనె వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి బాగా ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలకు కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి.

ఒత్తుగా పెరగాలంటే..

గుడ్డుసొనలో కొద్దిగా బటర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు చిట్లిపోవడం తగ్గడమే కాకుండా ఒత్తుగా పెరిగే అవకాశముంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని