లాక్‌డౌన్‌లో ఆమె డౌన్‌ కావొద్దు!
close
Published : 01/04/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌లో ఆమె డౌన్‌ కావొద్దు!

ఆమె కోసం ఆ అయిదూ చేయండి

కాఫీ, టీలు కావాలంటూ గంటకోసారి భర్త హుకుం... రకరకాల ఫలహారాలు చేసి పెట్టమంటూ పిల్లల మారాం... లాక్‌డౌన్‌ వేళ అమ్మకు అదనపు బాధ్యతలు వచ్చిపడుతున్నాయి...ఔను మరి! ఆఫీసుకెళ్లాల్సిన భర్త వర్క్‌ ఫ్రం హోం అంటూ ఇంట్లోనే ఉంటున్నాడు... బడిలో ఉండాల్సిన పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తున్నారు... సందట్లో సడేమియాలా కరోనా సాకుతో పనిపనిషి డుమ్మా కొట్టింది... అందుకే అమ్మ పని భారంతో కుదేలవుతోంది... నిస్వార్థంగా సేవ చేసే ఇల్లాలు తీరిక లేక అలసిపోతోంది... ఈ కష్ట సమయంలో అమ్మకు, ఆలికి గుదిబండ కాకుండా అండగా నిలవాల్సింది మనమే.

1. ర్ఫ్యూ వేళ వర్క్‌ ఫ్రం హోం అంటూ మగాళ్లంతా ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. పనితోపాటు వాళ్లకు కాలక్షేపానికి టీవీలు, నెట్‌ ఉన్నాయి. అడిగినవన్నీ చేసిపెట్టడానికి ఇల్లాలు ఉంది. మరి అమ్మకు అంత అదృష్టమెక్కడిది? పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీలు, స్నాక్‌లు.. సమయానికి అందిస్తూనే ఉండాలి. దీనికి అదనంగా ఇంట్లో ఉన్నవాళ్లు కొత్త అల్లుడిలా రకరకాల కోరికలు కోరుతూనే ఉంటారు. వీటితోపాటు ఇంటిపనులూ ఉంటాయి. మగాళ్లు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వారి పనికి బ్రేక్‌లిస్తూ ఆమెకు చేదోడువాదోడుగా ఉండాలి.

2. స్కూలు, కాలేజీలకు సెలవులిచ్చేశారు. పిల్లలు పుస్తకాలను మూలన పడేశారు. ఎదిగొచ్చిన పిల్లలకు ఈ కాలం అమ్మ మనసు గెల్చుకోవడానికి మంచి సమయం. అమ్మాయిలు టీవీలు చూడ్డం ఆపి కాసేపు వంటగదిలో దూరండి. హుషారుగా కూరగాయలు తరగండి. అమ్మ కరిగిపోయి తరిగిపోని ప్రేమ చూపిస్తుంది. ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌ పెళ్లయ్యాక మీరు చేయబోయే వంట ప్రయోగాలకు నెట్‌ ప్రాక్టీస్‌లానూ ఉపయోగపడుతుంది. అబ్బాయిలకూ ఇది అమోఘమైన అవకాశమే. చిన్నచిన్న పనుల్లో సాయం పడుతుంటే నా కొడుకు చెట్టంత ఎదిగాడనీ, చేతికి అంది వచ్చాడని అమ్మ మెచ్చుకుంటుంది.

3. ఇంట్లో మరీ చిన్నపిల్లలుంటే కాసేపు వారి ఆలనాపాలన చూడటం, అల్లరి అదుపులో పెట్టడంలాంటి బాధ్యతలు భర్త తలకెత్తుకోవాల్సిందే. ఈ కాలం గడుగ్గాయిల అల్లరి గురించి చెప్పాల్సిన పనే లేదు. బడికెళ్లకుంటే ఇంటిని చిందరవందర చేసేస్తుంటారు. ఇద్దరుంటే ముష్టి యుద్ధాలు సరేసరి. ఆ యుద్ధాలను ఆపాలంటే మామూలు ఓపిక చాలదు. ఆఫీసులో బాస్‌ చీవాట్లు పెట్టినప్పుడు ఆవేశాన్ని అణచుకునే సీన్‌ గుర్తుకు తెచ్చుకుంటే పిల్లల్ని కట్టడి చేయడం ఏమంత కష్టం కాదు.

4. పిల్లల అల్లరిని అరికట్టాలంటే... వాళ్ల బుర్రకు పని చెప్పే ఆటపాటలవైపు దృష్టి మళ్లించాలి. పిల్లలతో కలిసి కథల పుస్తకాలు చదవడం, డ్రాయింగ్‌ వేయించడం, కొత్తకొత్త క్రాఫ్ట్స్‌ నేర్పించడం, పాత ఆటలు ఆడించడం, తమ పనులు తామే చేసేలా శిక్షణనివ్వడం.. ఇలాంటివి మగాళ్లు చేయిస్తుంటే ఇల్లాలికి కచ్చితంగా భారం తగ్గుతుంది.

5. కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు మానసిక ఒత్తిళ్లకూ గురవుతారని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ సమయంలో నీకు సహకారం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని ప్రతి మహిళకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఆ ఇంటి సభ్యులదే. ప్రేమగా మాట కలపడం, చిన్నచిన్న సరదాలు తీర్చడం, పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం.. ఇలాంటివి. ఈ సహకారం ఉంటే మన అమ్మ, భార్య, అక్కాచెల్లీ మనకోసం ఎన్ని పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.


ఆమెపై భారం మోపొద్దు

డిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కి అమ్మ ప్రేమ విలువ బాగా తెలుసు. అందుకే ఈ లాక్‌డౌన్‌ సమయంలో అసలే తీరికలేని పనులతో ఉండే ఇల్లాలిపై మరింత పని భారం వేయొద్దు అని సూచించారు. ‘ఇంట్లో ఉన్నారు కదానీ భర్త, పిల్లలు ఆమెను నాలుగైదు రకాల వంటలు చేసిపెట్టమని అడగకండి. లాక్‌డౌన్‌ సమయాన్ని మీ హాలీడేస్‌గా భావించొద్ధు ఈ వేసవిలో... వంటగదిలో మహిళలు ఎక్కువ సమయం గడపడం అంత క్షేమం కాదు. ఇంట్లోని తల్లి, భార్య, సోదరి, కోడలుపై ఇంకా ఎక్కువ భారం మోపడం మంచిది కాదు’ అంటూ సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం కోసం ఎన్ని పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ మన విపరీత కోర్కెలతో వాళ్లకు పని భారం పెరిగితే ఒత్తిడికి లోనవుతారు. ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. అలా చేయొదు’్ద అని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని