భయాన్ని జయిద్దాం!
close
Published : 03/04/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయాన్ని జయిద్దాం!

కళకళ్లాడుతూ ఉండే ఇల్లు... ఆలాజాలంగా ఉండే పిల్లలు... ఇప్పుడా సందడి లేదు. కరోనా వార్తలు వింటూ భయాందోళనలు. ఇంట్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా అనుమానం... కంటిమీద కునుకుండదు.. తీవ్ర మానసిక ఆందోళనలు... నిజానికి సమస్య తీవ్రతని మించి జనం గగ్గోలు పెడుతున్నారన్నది వైద్య నిపుణుల అభిప్రాయం... ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. కానీ మానసికంగా కుంగిపోతే సరికొత్త సమస్యలు తప్పవు! అందుకే దీన్నుంచి బయటపడాలి. దీనికి అమ్మ, నాన్నే ఆలంబన కావాలి.

ఇదో అవకాశం: మనసులోని ఆందోళన తగ్గాలంటే మనం యాక్షన్‌ మోడ్‌లోకి దిగాల్సిందే. ప్రతికూల ఆలోచనలు మాని చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. లిఫ్ట్‌లో మీట నొక్కడానికి, రెయిలింగ్‌ పట్టుకోవడానికి భయపడుతున్నప్పుడు... మెట్లు ఉపయోగించాలి. కుటుంబంతో నాణ్యమైన సమయం గడపాలి. రొటీన్‌కి భిన్నంగా కొత్తగా ప్రయత్నించాలి. వంటగదిలో ప్రయోగాలు, తోట పని, పుస్తకాలు చదవడం, వ్యాయామం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు... ఇలా బిజీగా ఉంటే ఒత్తిడికి చోటు ఎక్కడ ఉంటుంది?●

స్నేహం వదలొద్దు: మనం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పే స్నేహితులు, సన్నిహితులు కొందరు ఉంటారు. బాధ, భయంలో ఉన్నప్పుడు వాళ్లతో మాట కలపాలి. అభిప్రాయాలు పంచుకోవాలి. కచ్చితంగా మనకు సాంత్వన చేకూర్చే మాటలు దొరుకుతాయి. ఫోన్‌, వీడియో కాల్స్‌.. ఏదైనా ఫర్వాలేదు. దాంతో మానసిక ఉపశమనం కలుగుతుంది. సాయం పొందడానికి మొహమాటపడొద్ధు ●

అంగీకరించాల్సిందే: వారాలకొద్దీ ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఒక్కోసారి గోడలు బద్దలు కొట్టుకొని వెళ్లిపోవాలి అనిపిస్తుంది. అప్పుడేమవుతుంది? కరోనా కాటేస్తుంది. ఇంట్లో ఉండటమే మార్గం అయినప్పుడు మనం చేయాల్సిందేం ఉండదు. పరిస్థితిని అంగీకరించాల్సిందే. కాలు బయట పెడితే ప్రమాదం.. ఇంతకు మించి ఏం చేయలేం.. అనుకుంటే సగం భారం తగ్గుతుంది. ●

పెద్దల పాత్ర: యాంగ్జైటీ డిజార్డర్‌ ఉన్నవాళ్లే అతిగా భయాందోళనలకు గురవుతారంటారు మానసిక నిపుణులు. వీళ్లని కాచుకొని ఉండాల్సింది పెద్దలే. తమ పిల్లలు ఇతర వ్యాపకాల్లో నిమగ్నమయ్యేలా చూడాలి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. భయపెట్టే మాటలొద్ధు పుకార్లు వాళ్ల ముందు ప్రస్తావించవద్ధు కుటుంబ పెద్దలు సానుకూలంగా ఉంటే ఆ ప్రభావం తప్పకుండా పిల్లలపై ఉంటుంది. క్షణక్షణం అదే సమాచారం తెలుసుకుంటుంటే మనసులో సానుకూల ఆలోచనలకు చోటుండదు. దీన్నుంచి బయట పడాలంటే మన మెదడుకు అందించే సమాచారం, దృశ్యాలు, వీడియోలు సానుకూలమైనవీ ఉండాలి. వదంతులు నమ్మొద్ధు కచ్చిత గణాంకాలు ఇచ్చే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ వెబ్‌సైట్లపైనే ఆధారపడాలి. ●

షేర్‌ చేయొద్దు: ప్రస్తుత గడ్డు పరిస్థితినీ తేలిగ్గా తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య వీడియోలు సృష్టిస్తున్నారు కొందరు. ఇంట్లో భార్యతో వారం రోజులు ఉండలేను.. నా స్నేహితులను కలవకుండా ఉండటం కష్టం... ఈ తరహావి వాట్సాప్‌, టిక్‌టాక్‌ల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇవి సున్నిత మనస్కులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సరదాగా అనిపించినా ఆలోచనలను తప్పుదోవ పట్టిస్తాయి. ఈ పనికిరాని సమాచారాన్ని ఎప్పటికప్పుడు వడగట్టాలి. ఎక్కడా షేర్‌ చేయొద్ధు ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఎప్పుడూ సంతోషంగా, కాస్త జాగ్రత్తగా ఉంటే మనం పూర్తిగా శత్రువును జయించినట్టే.●

పోల్చుకోండి: గత చరిత్రను తిరగేస్తే మానవాళిని పట్టి పీడించిన ఉత్పాతాలెన్నో కనిపిస్తాయి. ప్రపంచయుద్ధాలు, భయంకర వ్యాధులు, వాతావరణ ఉపద్రవాలు.. ఎన్నింటినో తట్టుకున్నాం. ప్లేగు, కలరా, ఫ్లూ, సార్స్‌లాంటి ఎన్నో మహమ్మారులు కుదిపేశాయ్‌. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. అయినా ప్రపంచం ఏమీ అంతం కాలేదు కదా! ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కరోనా వైరస్‌పై నిరంతరాయంగా పోరాడుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు. త్వరలోనే టీకా వస్తుందంటున్నారు. అన్నింటికీ మించి మనదేశంలో వైరస్‌ బారినపడ్డవాళ్లలో అత్యధికుల పరిస్థితి ప్రమాదకరంగా లేదంటున్నారు. ప్రభుత్వాలూ చర్యలు చేపడుతున్నాయి. అందుకే ఈ గడ్డుకాలం ముగిసిపోతుందనే సానుకూల దృక్పథంతో ఉండాలి. ●

ప్రభుత్వాల చొరవ: ఈ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బ్రిటీష్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ ఒక అధ్యయనం చేసింది. అందులో తేలిన వాస్తవం ఏంటంటే.. లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఇంట్లోని జనాల్లో సామాజిక అశాంతులు, గొడవలు, మానసిక సమస్యలు, పిల్లలపై దాడులు ఎక్కువ కావడం గమనించారు. వైరస్‌ పరోక్షంగా ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తుందని హెచ్చరించారు. పరిస్థితి మరీ భయానకంగా లేదని చెబుతూ నాయకులు, శాస్త్రవేత్తలు, వైద్యులు.. ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆ అధ్యయనం సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని