కాశీ అన్నపూర్ణ ఈ బామ్మ!
close
Published : 12/04/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాశీ అన్నపూర్ణ ఈ బామ్మ!

అక్కడంతా కోలాహలంగా ఉంది. ఒకరు కూరగాయలు తరుగుతుంటే మరొకరు పెద్ద పాత్రలో అన్నం వండుతున్నారు. మరొకరు స్వీట్లు చేస్తున్నారు. ఆ పక్కనే ఓ పెద్దావిడ కుర్చీలో కూర్చొని పూరీలు చేస్తున్నారు. కాసేపటికి వండిన పదార్థాలన్నింటినీ డబ్బాల్లో సర్దుతున్నారు. ఈ వంటకాలు ఏ వేడుకకో తరలిస్తున్నవి కావు. లాక్‌డౌన్‌ వేళ.. అన్నార్తుల కోసం ఓ బామ్మ పడుతున్న ఆరాటం. వారణాసికి చెందిన విమలా దివాన్‌కు 82 ఏళ్లు. అధ్యాపకురాలిగా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారామె. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ బామ్మ నేను సైతం అంటూ ముందుకొచ్చారు. పని దొరక్క పస్తులతో రోజులు గడుపుతున్న కూలీల పాలిట అన్నపూర్ణగా మారారు. తన పెన్షన్‌ సొమ్ముతో ఈ బృహత్కార్యాన్ని చేస్తున్నారామె! స్వయంగా వండుతున్నారు కూడా! ఈ పెద్దావిడ పెద్దమనసు... ఆమె ఉంటున్న కాలనీవాసులనూ కదిలించింది. వారంతా ఆమెతో చేయి కలిపారు. క్యాన్సర్‌ బారిన పడి అయిదేళ్లు పోరాడి గెలిచారు విమల. ‘క్యాన్సర్‌నే గెలిచిన నేను కరోనాకు భయపడను. ఈ ఆపత్కాలంలో నావల్ల అయ్యింది చేస్తా’ అని చెబుతోన్న ఈ బామ్మ ఎందరికో ఆదర్శనీయం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని