బొప్పాయి.. గొప్పదోయి
close
Published : 27/04/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొప్పాయి.. గొప్పదోయి

కరోనాను అడ్డుకునేది లాక్‌డౌన్‌. దాన్ని దాటుకొని వచ్చే వైరస్‌ను తిప్పికొట్టేది మనలోని రోగనిరోధక శక్తే! అందుబాటు ధరలో ఉండే పోషకాల గని బొప్పాయి. ఈ పండుకు మన ఆహారంలో చోటిస్తే చాలు.. తక్షణ రక్షణ సిద్ధిస్తుంది.●

* బొప్పాయిలోని ఎ, సి, కె విటమిన్లు ఇమ్యూనో బూస్టర్లుగా పనిచేస్తాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

* ఇందులో నీరు, పీచు తగిన ప్రమాణంలో ఉంటాయి. ఫోలిక్‌ ఆమ్లం, పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, జింక్‌ అదనపు శక్తినిస్తాయి.

* ఒక కప్పు (వంద గ్రాములు) బొప్పాయి తింటే 40 కెలొరీలు లభిస్తాయి. రోజులో మనకు అవసరమయ్యే విటమిన్‌-ఎలో 20 శాతం, విటమిన్‌-సిలో 70 శాతం లభిస్తుంది.

* తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని హాయిగా తినొచ్ఛు 100 గ్రాముల బొప్పాయిలో చక్కెర ఎనిమిది గ్రాములే ఉంటుంది.

* కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుందీ ఫలం.

* బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరచూ గ్లాసు రసం తీసుకుంటే మలబద్ధకం ఉండదు.

* ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోనూట్రియంట్లు.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

పిల్లలు, వృద్ధులు 150 గ్రాముల వరకు రోజూ తీసుకోవచ్ఛు మధుమేహ రోగులూ తినొచ్ఛు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని