రక్షకులకు అండగా...
close
Updated : 01/05/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్షకులకు అండగా...

భర్త యుద్ధంలో వీరమరణం పొందాడు. భార్య కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో  అలుపెరుగక శ్రమిస్తున్న భద్రతా సిబ్బందికి అండగా నిలుస్తోంది. ఆమే నితికా కౌల్‌ ధౌండియాల్‌....
భర్త చనిపోయి ఏడాదైంది. వేరొకరైతే ఆ బాధలోనే ఉండేవాళ్లు. కానీ.. నితికా అనుక్షణం అతడి ఆశయాల్నే గుర్తు చేసుకుంటోంది. అందుకే ఈ కరోనా కష్టకాలంలో జనానికి వెల కట్టలేని తోడ్పాటునందిస్తున్న పోలీసు సిబ్బందికి ఏదైనా చేయాలనుకుంది. తన సేవింగ్స్‌ అన్నీ బయటికి తీసింది. సన్నిహితులు, బంధువులు, స్నేహితుల్ని అర్థించింది. పరిచయమున్న సైనిక కుటుంబాల నుంచి విరాళాలు సేకరించింది. మొత్తం డబ్బులతో మాస్కులు, పీపీఈలు, గ్లౌజుల్లాంటి వెయ్యికి పైగా భద్రతా కిట్లు కొని హరియాణా రాష్ట్రంలోని పోలీసులకు అందజేసింది. ‘పోలీసులు కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. వాళ్లకు అండగా ఉండేందుకే ఈ చిన్న ప్రయత్నం’ అంటోంది నితికా. ఆమె భర్త మేజర్‌ విభూతి శంకర్‌ ధౌండియాల్‌ జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైష్‌-ఇ-మహమ్మద్‌ ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ‘ధౌండియాల్‌ దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. ఆయన భార్య హరియాణా పోలీసులకు విలువైన సాయం అందించారు’ అని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రశంసించారు. నితికా ఈమధ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగానికి ఎంపికైంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని