ఇమ్యూనిటీని పెంచే ఏ... బీ... సీ...
close
Published : 06/05/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇమ్యూనిటీని పెంచే ఏ... బీ... సీ...

ఈ సమయంలో రోగనిరోధక శక్తి అండగా ఉంటే చాలు అదే మనకి పదివేలు. ఇందుకోసం ఏం చేయాలి అని తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితో ఈ జ్యూస్‌ చేసుకుని తాగండి. చలాకీగా... చురుగ్గా అయిపోండి..
యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌... ఈ మూడింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీట్‌రూట్‌, క్యారెట్‌.. ఈ రెండు జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తాయి. వీటిల్లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పీచు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలోని ల్యూటిన్‌, బీటాకెరొటిన్‌ పోషకాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరోవైపు బీటాకెరొటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉండి... ఎర్రరక్తకణాలు, హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతుంది. అలాగే క్యారెట్‌లోని బీటాకెరొటిన్‌ యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి.. వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జ్యూస్‌ కోసం:
కావాల్సినవి: యాపిల్‌ - రెండు, బీట్‌రూట్‌ - ఒకటి, క్యారెట్‌ - రెండు, పుదీనా ఆకులు - కొన్ని, తేనె - రెండు పెద్ద చెంచాలు, నిమ్మరసం - చెంచా, నీళ్లు - తగినన్ని.
తయారీ: యాపిల్‌, బీట్‌రూట్, క్యారెట్‌లను శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మరసం, తేనె వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఈ రసాన్ని గ్లాసులోకి తీసుకుని తాగేస్తే సరి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని