ఇంటి నుంచి ఇలా పని!
close
Published : 26/05/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి నుంచి ఇలా పని!

నవజీవన సూత్రాలు

గూగుల్‌, ట్విటర్‌ సహ ప్రముఖ సంస్థలన్నీ ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొంతమంది మహిళా ఉద్యోగులు మొదటిసారిగా ఇలా పనిచేస్తున్నారు. ఇంట్లో ఉంటూనే లక్ష్యాలు సాధించాలంటే మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం...

చాలామంది ల్యాప్‌టాప్‌, ఆఫీసు ఫైళ్లను మంచం లేదా సోఫా మీద చిందరవందరగా పడేసి అలానే పనిచేస్తుంటారు. అలాకాకుండా ప్రత్యేకంగా టేబుల్‌, కుర్చీ ఏర్పాటు చేసుకోవాలి. టీవీని ఆఫ్‌చేసి, శబ్దాలేవీ వినిపించకుండా తలుపులు వేసుకోవడం మంచిది. మీరు ఆఫీసు పనిచేస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తే వాళ్లు అంతరాయం కలిగించరు.

దుస్తులు..

సాధారణంగా ఇంట్లో వేసుకునే దుస్తులే వేసుకుని పనిచేయడానికి కూర్చుంటే పనిచేస్తున్న భావన కలగదు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్సులు, మీటింగ్‌లప్పుడు ఆఫీసుకు వేసుకెళ్లే దుస్తులనే ధరించాలి.

సమాచార సాధనాలు...

పనిలో ఉన్నప్పుడు ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టాలి. సహోద్యోగులతో మాట్లాడుతూ ఇతరులకు సందేశాలు పంపడం లాంటివి చేయకూడదు.

* జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌లాంటి వీడియో కాన్ఫరెన్స్‌ వేదికలను ఉపయోగించినప్పుడు పరికరాలను ముందుగానే జాగ్రత్తగా పరిశీలించి సిద్ధం చేసిపెట్టుకోవాలి.

* వీడియో కాలింగ్‌కు వినియోగిస్తున్న సాధనాన్ని టేబుల్‌ మీద పెట్టాలిగానీ చేత్తో పట్టుకోకూడదు. చేత్తో పట్టుకుంటే అవతలి వాళ్లకు మీరు కదులుతూ కనిపిస్తారు.


మధ్యలో వెళ్లకూడదు..

వర్చ్యువల్‌ మీటింగ్‌ జరుగుతున్నప్పుడు అవకాశం ఉన్నా మధ్యలోంచి వెళ్లిపోకూడదు. మీకు మరో ముఖ్యమైన పని ఉంటే ముందే ఈ విషయాన్ని తెలియజేయాలి. లేదా మెయిల్‌ చేయాలి. అప్పుడు ముందుగా మీ దగ్గరే ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు.

* కంప్యూటర్‌ కెమెరా, స్పీకర్ల పనితీరును ముందుగానే పరీక్షించాలి. మీటింగ్‌ మొదలుకావడానికి ముందే వీడియో, ఆడియోలను సరిచూసుకోవాలి.

- కవితా గూడపాటి, కెరీర్‌ కౌన్సెలర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని