ఇల్లే కదా హిమసీమ..
close
Published : 01/06/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇల్లే కదా హిమసీమ..

ఇంట్లో ఉన్నా... నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగానే ఉంటోంది. అదే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు...

* శుద్ధి చేసిన గాలిని అందించే ఫిలడెండ్రాన్‌, పీస్‌లిల్లీ, మనీప్లాంట్‌, ఇంగ్లిష్‌ ఐవీ వంటి మొక్కల్ని వేడి లోపలకి వచ్చే ప్రదేశాల్లో అంటే కిటికీలు, తలుపుల దగ్గర ఉంచాలి. ఇవి ఇంటిలోపలి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.
* బాల్కనీలు, కిటికీల దగ్గర వట్టివేళ్ల చాపల్ని వేలాడదీస్తే సరి. వీటిని తరచూ తడుపుతుంటే గది చల్లబడుతుంది. ముదురు రంగు కర్టెన్లతో ఇంట్లోకి నేరుగా ఎండ తగలకుండానూ చేయొచ్చు.
* అనవసరంగా ఇంట్లో లైట్లు వేసి పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఇన్‌కాండిసెంట్‌ బల్బులు...ఇవి కరెంటు బిల్లుల్ని ఎక్కువ పెంచడమే కాకుండా వేడినీ వెదజల్లుతాయి. వాటికి బదులు ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్‌ బల్బుల్ని వాడుకోవచ్చు. వీటితో పాటు అతిగా ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల వాడకమూ వద్దు.  వంటగదిలో తప్పనిసరిగా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ని ఉపయోగించుకుంటే వంట పని తేలిక అవుతుంది.
* డాబా నుంచి వేడి గదిలోకి రాకుండా కూల్‌ పెయింట్స్‌ వాడుతుంటారు. దానికి బదులు తెల్లటి సున్నం వేసినా ఫలితం ఉంటుంది. అలానే టెర్రస్‌పై కొబ్బరి లేదా తాటాకులతో పందిరీ వేసుకోవచ్చు.
* టేబుల్‌ ఫ్యాన్‌ ఉపయోగించండి. దానికి ఎదురుగా, కాస్త దగ్గరగా ఐస్‌క్యూబ్‌ బౌల్‌ని పెడితే చల్లటి గాలి వస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని