పుట్టింటి నగలు వాళ్లు తీసుకున్నారు!
close
Updated : 03/06/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టింటి నగలు వాళ్లు తీసుకున్నారు!

పదేళ్ల కిందట నా పెళ్లైంది. పుట్టింటి వాళ్లు పదిలక్షల రూపాయలు, నగలు కట్నంగా ఇచ్చారు. అవన్నీ అత్తింటివారు వాడుకున్నారు. తర్వాత పుట్టింటి ఆస్తి పంపకాల్లో నాకు అమ్మ నగలు, కొంత డబ్బు వచ్చాయి. వాటిని నాకు తెలియకుండా మా ఆడపడుచుకి కానుకగా ఇచ్చారు. నా పుట్టింటి ఆస్తి అది. మా అమ్మ జ్ఞాపకం కూడా. అదే విషయం అడిగితే ‘నువ్వు ఈ ఇంట్లో భాగం. నీకంటూ ప్రత్యేకంగా ఆస్తులు ఉండవు’ అని వాదిస్తున్నారు. వాటిని తిరిగి తీసుకోవాలనుకుంటున్నా?

- ఓ సోదరి

చట్టం మీకు తప్పకుండా సాయం చేస్తుంది. కానీ మీ నగలు తిరిగి తీసుకోవడానికి మీకు మీ భర్త తోడుగా నిలుస్తారా అనే విషయంలో మీకు స్పష్టత అవసరం. అది తప్ప మీకూ, మీవారికి మధ్య వేరే గొడవ లేకపోతే ఆయన్ని మినహాయించి మిగిలిన వారి మీద గృహహింస చట్టం కింద కేసు వేయొచ్ఛు దానిలో ‘రిటర్న్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ అండ్‌ క్యాష్‌’ కింద పిటిషన్‌ దాఖలు చేస్తే వారి నుంచి మీ నగలు తిరిగి రాబట్టుకోవచ్ఛు పుట్టింటి వారి నుంచి వచ్చిన ఏ ఆస్తి అయినా... అంటే పెళ్లి సమయంలో పెట్టిన నగలు, బహుమతులు ఆ మహిళ సొంతం. అత్తింటివారికి వాటిని అడిగే లేదా తీసుకునే హక్కులు లేవు. కోడలు ఇంట్లో వ్యక్తి అని భావించడం సబబే కానీ ఆమె అనుమతి లేకుండా తీసుకోవడం సరికాదు. గృహహింస చట్టం-2006 ప్రకారం బాధిత మహిళలకు ఇచ్చే నష్టపరిహారంలో ఆమెకు చెందిన ఆస్తులు, నగలు సంబంధించినవీ చేర్చాలని ఉంది. ఒకవేళ మీ భర్త మీకు సహకరించకపోతే అతన్ని ప్రతివాదిగా చేర్చవచ్ఛు ఆయన జీతం లేదా ఆస్తిలోంచి కూడా నష్టపరిహారం పొందవచ్ఛు మీరు వివాహ బంధాన్ని నిలుపుకోదలుచుకుంటే గృహహింస చట్టం ఉపయోగపడుతుంది. వద్దనుకుంటే హిందూ వివాహ చట్టం కింద విడాకులు కోరుతూ మీకు రావాల్సిన మొత్తం అంటే.. మీరు ఇచ్చిన ఆస్తి, నగలు, పెట్టిన ఖర్చులు, అనుభవించిన క్షోభ అన్నింటికీ కలిపి పెద్ద మొత్తంగా హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 25 కింద శాశ్వత నష్టపరిహారం కోరవచ్ఛు ఏ కేసు వేసినా మీరు దానికి సంబంధించిన సాక్ష్యాలు పక్కాగా చూపించగలగాలి.

మీ ప్రశ్నలు vasulegal@eenadu.net కు పంపించగలరు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని