నాతో మాట్లాడరెందుకో!
close
Published : 05/06/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాతో మాట్లాడరెందుకో!

నేనో చిన్న సంస్థలో పనిచేస్తున్నా. మా మేనేజర్‌ కంపెనీకి డైరెక్టర్‌ కూడా. ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తారాయన. మంచి వ్యక్తి. కానీ ఆయన నా విషయంలోనే సరిగ్గా ప్రవర్తించడం లేదనిపిస్తోంది. గతంలో వారానికోసారి మీటింగ్‌ పెట్టేవారు. ఇప్పుడు అడిగితే టైమ్‌ లేదంటున్నారు. చివరికి వారాంతంలో సమయం ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కూడా వాయిదా వేస్తూనే ఉన్నారు. ఎవరు సలహాలు అడిగినా ఉత్సాహంగా ఇస్తారు. నాకు మాత్రం అలా ఇవ్వరు?
తమ సూచనలు, సలహాల మేరకు మాత్రమే ఉద్యోగులు పనిచేయాలని చాలామంది అధికారులు కోరుకుంటారు. కానీ ఇక్కడ మీ మేనేజర్‌ మీకు పూర్తి అధికారాన్ని ఇచ్చారంటే ఇది అభినందించదగ్గ విషయమే కదా!  
* అందరితో ముఖాముఖిగా చర్చించే అధికారి మీతో అలా చేయడం లేదంటే... మీరు స్వతంత్రంగా పనిచేయగలరనే నమ్మకం ఆయనకు పూర్తిగా ఉండి ఉంటుంది. కానీ ఆయన సూచనలు తప్పనిసరి అని మీరు గట్టిగా కోరితే తప్పకుండా తిరిగి సమావేశాలను ఏర్పాటుచేస్తారు. గతంలో నిర్వహించిన సమావేశాలు నాకెంతో ఉపయోగకరంగా ఉండేవి. వాటిని తిరిగి నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మీ అభిప్రాయం వెంటనే అవసరం అవుతుంది. అలాంటప్పుడు అందుబాటులో ఉండమని అడగండి.
* అలాగే సమావేశం జరిగేంత వరకూ ఎదురుచూడలేని విషయాలు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఎలా కాంటాక్ట్‌ చేయాలో అడగండి. ఫోన్‌లు, సందేశాలకు ఆయన అందుబాటులో లేని సందర్భంలో ఎలా స్పందించాలో మీకు అర్థంకావడం లేదనే విషయాన్ని స్పష్టంగా, మర్యాదగా చెప్పండి.
* స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చారు. కానీ ఒక్కోసారి నేను స్వయంగా నిర్ణయం తీసుకునే ముందు మీ సలహా చాలా అవసరం అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి మీతో తప్పనిసరిగా మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి ఫోన్‌లోనైనా అందుబాటులో ఉండమని కోరండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని