చారన్నమే చాలంటున్నాడు!
close
Published : 12/06/2020 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చారన్నమే చాలంటున్నాడు!

ప్ర: మా బాబుకు తొమ్మిదేళ్లు. మాంసాహారం తినడు. గుడ్డు నచ్చదు. చారుతో తినేస్తాడు. ఇలా ఐతే వాడికి పోషకాలు అందేదెలా?

- మల్లిక, నెల్లూరు.

జ: తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారులు 132- 145 సెం.మీ. ఎత్తు, 32 నుంచి 40 కిలోల దాకా బరువు ఉండొచ్ఛు చారు తినడం తప్పుకాదు. దాంతోపాటు అన్ని రకాల పదార్థాలు బాబు తినేలా చూసుకోవాలి. ప్రతీపూట అన్నమే కాకుండా.. చపాతీ, బ్రెడ్‌, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం ఏదైనా పెట్టొచ్ఛు ఇలాంటివి పెడితే సూక్ష్మపోషకాలు, పీచు సమృద్ధిగా అందుతాయి. మాంసాహారానికి బదులుగా ఉడకబెట్టిన సెనగలు, గుగ్గిళ్లు, వేయించిన/ఉడకపెట్టిన వేరుసెనగలు, పాలు, పెరుగు పెట్టొచ్ఛు బాదం, నువ్వులు.. లాంటివాటితో రకరకాల చిరుతిళ్లు చేసి తినిపించొచ్ఛు కూరగాయలను కూరగా మాత్రమే తీసుకోవాలని లేదు. కీరాను చక్రాల్లా కోసి పెట్టొచ్ఛు క్యారెట్‌ను ఫ్రెంచ్‌ఫ్రైస్‌లా స్టిక్స్‌మాదిరి చక్కగా గార్నిష్‌ చేసి పెట్టొచ్ఛు క్యారెట్‌ను తురిమి పెరుగులో కలిపి రైతాలా అందివ్వొచ్ఛు కూరగాయలన్నింటిని కలిపి వెజిటబుల్‌ కట్‌లెట్‌లా చేసి పెట్టొచ్ఛు ఇంకా తినడం లేదు అనిపిస్తే విటమిన్‌-సి ఉండే పండ్లను పెట్టొచ్ఛు చిన్నారులు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉంటే తినడం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే.. తరచూ జబ్బు పడుతున్నప్పుడు, త్వరగా అలసిపోతున్నా... వారు తీసుకునే ఆహారం ఎంత మోతాదులో ఉందో గమనించండి. చిన్నారులకు తీసుకునే ఆహారం మోతాదు ఒక అంశమైతే... అందులో పోషకాలెన్ని ఉన్నాయన్నది మరో ప్రధాన అంశం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని