అమ్మానాన్నలతో మాట్లాడదు...
close
Published : 19/06/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మానాన్నలతో మాట్లాడదు...

మా స్నేహితురాలి అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. తను బాగా చదువుతుంది, శ్రద్ధగా వ్యాయామాలు చేస్తుంది. స్నేహితులతో బాగా మాట్లాడుతుంది. తన అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగులే. అయితే వాళ్లతో ఎక్కువగా మాట్లాడదు. ఎందుకిలా ప్రవర్తిస్తోంది?
టీనేజ్‌ పిల్లలు సాధారణంగా ఇలానే ప్రవర్తిస్తుంటారు. ఈ వయసు పిల్లల్లో శారీరక, మానసిక మార్పు వస్తుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తీ వస్తుంది. కాబట్టి స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వాలనుకుంటారు. తల్లిదండ్రులేమో పిల్లలు బాధ్యతలు తీసుకోవాలనుకుంటారు. దాంతో ఇద్దరి మధ్యా గొడవలు వస్తుంటాయి.  
* ఈ వయసులో విచక్షణా జ్ఞానం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పేది తమ మంచికే అనే ఆలోచన ఉండదు. వీరిపై స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రహస్యాలు, ఆలోచనలను స్నేహితులతోనే పంచుకుంటారు.
* తల్లిదండ్రులేమో పిల్లల ఫోన్‌ నంబర్లు చూస్తుంటారు. డైరీ చదువుతుంటారు. చదువు సవ్యంగా సాగదేమోనని భయపడతారు. ఫోన్‌లో మాట్లాడుతుంటే గమనిస్తుంటారు. దుస్తుల విషయంలోనూ హెచ్చరిస్తుంటారు. తల్లిదండ్రులు ఇలా గమనించడం నచ్చక పిల్లలు మరింత దూరమవుతుంటారు.  
* పిల్లలు తేలిగ్గా అబద్ధాలు చెప్పడం, తల్లిదండ్రుల అతి జాగ్రత్తల వల్ల గొడవలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు తల్లిదండ్రులను బెదిరించడానికి, బాధపెట్టడానికి విపరీతంగా వ్యవహరిస్తుంటారు.
ఇలా చేయొచ్చు...
* తల్లిదండ్రులు తమ ఆలోచనలు, భయాలను పిల్లలతో స్వేచ్ఛగా పంచుకోవాలి. మాకు మీ మీద పూర్తి నమ్మకముంది. కానీ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల వల్ల భయపడుతున్నాం. మీ జాగ్రత్త కోసమే ఇవన్నీ చెబుతున్నామని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
* పిల్లలు ఎక్కువ సన్నిహితంగా మెలిగే స్నేహితులతో తల్లిదండ్రులు అప్పుడప్పుడూ మాట్లాడుతుండాలి. ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పిల్లల్ని తప్పుపట్టకుండా కలిసికట్టుగా పరిష్కారం కోసం ఆలోచించాలి. పిల్లల స్నేహితులను వారి ముందే కించపరుస్తూ మాట్లాడకూడదు.
* అప్పుడప్పుడూ కుటుంబ విలువలు, సామాజిక పద్ధతుల గురించి చెబుతుండాలి. మారుతున్న సమాజంలో విలువల గురించీ పిల్లలకు చెప్పాలి. క్రమశిక్షణతోపాటు పిల్లలకు ప్రేమనూ అందించాలి. పట్టువిడుపులుండాలి. పిల్లలకు పన్నెండేళ్లు వచ్చేలోపే ప్రేమ, అభిమానం, బాధ్యతలు, క్రమశిక్షణ, సమాజంలో ఎలా ప్రవర్తించాలో వంటివీ వివరించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని