చవక యాంటీబాడీ పరీక్ష
close
Published : 23/06/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చవక యాంటీబాడీ పరీక్ష

రోనా విజృంభిస్తున్న తరుణంలో యాంటీబాడీలు తరచూ ప్రస్తావనకు వస్తుండటం చూస్తున్నదే. వైరస్‌ల వంటివి దాడి చేసినప్పుడు ముందుగా ఎదుర్కొనేవి ఇవే. ఆయా వైరస్‌లకు అనుగుణంగా మన శరీరం వీటిని తయారుచేసుకొని పెట్టుకుంటుంది. మున్ముందు అవెప్పుడైనా దాడిచేస్తే యాంటీబాడీలు చుట్టుముట్టి, తుదముట్టిస్తాయి. అందుకే ఎవరైనా గతంలో ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారా? స్వీయ రోగనిరోధక జబ్బులతో బాధపడుతున్నారా? అనేది తెలుసుకోవటానికి వైద్యులు యాంటీబాడీ పరీక్షలు చేయిస్తుంటారు. కొన్ని పరీక్షలు యాంటీబాడీల ఉనికిని మాత్రమే చెబితే.. మరికొన్ని వాటి మోతాదులనూ తెలియజేస్తాయి. యాంటీబాడీల మోతాదులను తెలిపే పరీక్షలను అధునాతన ప్రయోగశాలల్లోనే చేయాల్సి ఉంటుంది. ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికి శాస్త్రవేత్తలు తాజాగా తేలికైన, చవకైన పరికరాన్ని రూపొందించారు. దీని పేరు ఎంటీఏడీ. నూలు దారం, వెలిగే ప్రొటీన్లు, స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సాయంతో ఇది పనిచేస్తుంది. సూదిమొనంత రక్తపు చుక్కతో నిమిషాల్లోనే ఫలితం బయటపడటం విశేషం. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? దారం మీద రక్తం చుక్కను వేయగానే దానికి యాంటీబాడీలు అంటుకుంటాయి. సెన్సర్‌ నుంచి వెలువడే ఆకుపచ్చ కాంతికి యాంటీబాడీలు మెరుస్తాయి. సరైన యాంటీబాడీలను గుర్తించినప్పుడు ఆకుపచ్చ కాంతి నీలం రంగులోకి మారిపోతుంది. దీన్ని స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా ఫొటో తీసేస్తుంది. అంతే యాంటీబాడీల గుట్టు బయటపడుతుంది. ఇది ఒకే సమయంలో రకరకాల యాంటీబాడీలను గుర్తించగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఎవరిలో ఉందనేది అంచనా వేయటానికిది ఎంతగానో తోడ్పడగలదని భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని