అల్లంతో ఆరోగ్యం!
close
Updated : 24/06/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లంతో ఆరోగ్యం!

ఎలాంటి వంటకానికైనా కాస్త అల్లం చేర్చితే...ఎంతో రుచి. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అల్లం పచ్చడి, అల్లం టీ... ఇలా ఏ రూపంలో అయినా దీన్ని తీసుకోవచ్చు.
అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. శరీర బరువుని తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులను నియంత్రిస్తుంది. ఈ కాలంలో జలుబు బారిన పడకుండా ఉండటానికి అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం ముక్కల్ని నీళ్లల్లో వేసి మరిగించి దానికి చెంచా తేనె కలిపి తాగితే ఎంతో మేలు.
* నెలసరి సమయంలో అల్లం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నాయి పరిశోధనలు. కీళ్ల నొప్పులకూ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
*ఆయుర్వేదం ప్రకారం అల్లానికి రక్తపోటుని నియంత్రించే శక్తి ఉంది. కడుపు ఉబ్బరాన్నీ, గ్యాస్‌ సంబంధిత సమస్యల్నీ అదుపులో ఉంచుతుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని