అలా పోల్చకండి!
close
Updated : 27/06/2020 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా పోల్చకండి!

పెద్దవాళ్లం కాబట్టి అన్నీ మనకి తెలుసు అని అపోహపడుతుంటాం. ఆ అభిప్రాయంతోనే పిల్లల పెంపకంలో కొన్ని పొరబాట్లు చేస్తుంటాం. అలాంటివే ఇవి..

అమ్మానాన్నలతో క్లాసులో జరిగిన ఏదైనా సందర్భం లేదా... స్నేహితులతో జరిగిన తగాదాల గురించి పిల్లలు చెబుతున్నప్పుడు చాలామంది పూర్తిగా వినరు. ఆ సంఘటనకు కారణం తమ పిల్లలే అనుకుని.. ‘నువ్వు ఏం చేశావో అర్థం అవుతుందా? ఇక మాట్లాడకు’...అంటూ గట్టిగా అరవడం మొదలుపెడతారు. దాంతో పిల్లలు తమ మనసులోని అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పడానికి భయపడతారు. పెద్దయ్యేకొద్ది ఈ భయం కూడా పెరుగుతుంది. ఈ ప్రవర్తన వల్ల పిల్లలు పెద్దవాళ్లకు మానసికంగా దూరమవుతారు.అందుకే పిల్లలు చెప్పేది పూర్తిగా వినాలి.

* ఇష్టమైన ఆహారపదార్థాలను పిల్లలు కాస్త ఎక్కువగా తింటారు. ‘ఇంత తింటే నువ్వు లావయి పోతావ్‌’ అంటూ పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. దాంతో పిల్లలు ఏం తినాలన్నా వెనుకాడతారు. కాస్తంత తిన్నా...ఎక్కడ లావు అవుతామో అనే ఆలోచన వారి మనసులో నాటుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి పిల్లల్లో చక్కగా అవగాహన కల్పించాలే తప్ప, వారిలో లేనిపోని భయాలను నింపేయకూడదు.

* తోబుట్టువులు, స్నేహితులతో సరితూగాలంటూ పిల్లలను పోల్చితే అది వారి మనసులో ఇతరుల పట్ల ద్వేషం, అసూయను పెంచుతుంది. తల్లిదండ్రులు పిల్లలను ఎవరితోనూ పోల్చకుండా, వారి సామర్థ్యాన్ని ప్రశంసిస్తే చాలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని