చెప్పుకోండి చూద్దాం?
close
Published : 29/06/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెప్పుకోండి చూద్దాం?

ఒన నక్క నదికి వెళుతూ 6 పులులను చూసింది. ప్రతి పులి నదికి వెళుతున్న రెండు కోతులను చూసింది. ప్రతి కోతి చేతిలో ఒక చిలుక ఉంది. ఇప్పుడు ఆ నదికి వెళుతున్న ప్రాణులు ఎన్నో చెప్పండి?

ఎలాగెలాగో!

ఒక వ్యక్తిని ఎవరో కాల్చారు. అతడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. వచ్చీరాగానే పోలీసులకు కాల్చింది ఎవరో తెలిసిపోయింది. ఎలా అంటారు?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


ఏమిటిది?

ఇక్కడున్న ఆధారాలను బట్టి దీని పేరేంటో రాయండి?


రాయగలరా?

ఇక్కడ కొన్ని జీవులున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో వాటి పేర్లు ఆంగ్లంలో రాయగలరా?


1. పొడవాటి మానుకు నీడలేదు? ఏమిటది?

2. నీటితో పంట. ఆకులు లేని పంట.. ఇంతకీ ఏంటంట?

3. అందరికీ కొడుకు, అందరికీ కూతురు ఎవరు?


తమాషా ప్రశ్నలు

1. ఆవు ఎలా ఉంటుంది?

2. ఒక గోడ ఇంకొక గోడతో ఏమని చెబుతుంది?

3. మనం నీటిని ఎందుకు తాగుతాం?


అమ్మ: పింకీ.. పప్పీ ఎందుకో అదే పనిగా అరుస్తోంది చూడు.

పింకి: ఓ.. అదా.. అది నిన్నే పిలుస్తోంది మమ్మీ..

అమ్మ: నన్నా.. ఎందుకు? ఇందాకే కదా! దాని గిన్నె నిండా పాలు పోశాను.

పింకి:అది కాదు. మమ్మీ రోజూ ఈ టైంకి అది నాతో పాటు కార్టూన్‌ షో చూస్తుంది కదా..! ఈ రోజేమో నువ్వు టీవీ పెట్టొద్దు అన్నావ్‌గా.. అందుకే అరుస్తోంది.

అమ్మ: ఆఁఆఁఆఁ..


జవాబులు

చెప్పుకోండి చూద్దాం: నక్క నదికి వెళుతోంది. దారిలో ఆగిఉన్న 6 పులులను చూసింది. అంటే అవి అక్కడే ఉన్నాయి. పులులన్నీ కలిసే రెండు కోతులను చూశాయి. రెండు కోతుల చేతుల్లో రెండు చిలుకలున్నాయి. అంటే రెండు కోతులు, రెండు చిలుకలు, నక్క మొత్తం అయిదు ప్రాణులు నదికి వెళుతున్నాయి.

ఎలాగెలాగో: రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి చనిపోలేదు. తనను ఎవరు కాల్చారో అతనే పోలీసులకు చెప్పాడు!

కవలలేవి: 1,4

ఏమిటిది: cloud

రాయగలరా: 1.deer 2.rabbit 3.bear 4.hedgehog 5.squirrel 6.wolf 7.fox 8.owl

పొడుపు కథలు: 1.దారి 2.ఉప్పు 3.పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు

తమాషా ప్రశ్నలు: 1.కట్టేస్తే ఉంటుంది. లేకపోతే పోతుంది. 2.గది మూల దగ్గర కలుద్దాం అని 3.నీటిని తినలేం కాబట్టిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని