లక్షణాలు లేవనీ..
close
Published : 30/06/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్షణాలు లేవనీ..

కరోనా వైరస్‌ సోకినా లక్షణాలు అంతగా కనిపించకపోతే ఆనందంగానే ఉంటుంది. కానీ వీరిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనా అధ్యయనంలో తేలింది. జబ్బు నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత పరిశీలించగా.. కరోనా లక్షణాలు తలెత్తనివారిలో 40% మందిలో యాంటీబాడీల సంఖ్య గుర్తించలేని స్థాయికి పడిపోయింది. అదే లక్షణాలు కనిపించినవారిలో 13% మందిలోనే ఇలా జరగటం గమనార్హం. లక్షణాలు లేనివారిలో వాపు ప్రక్రియ నివారకాలుగా ఉపయోగపడే కణ సంకేత ప్రొటీన్ల సంఖ్యా తక్కువగా ఉండటం గమనార్హం. అంటే లక్షణాలు లేనివారిలో కరోనా వైరస్‌కు రోగనిరోధక ప్రతిస్పందన బలహీనంగా ఉందనే అర్థం. కొవిడ్‌-19 బారినపడ్డవారికి తిరిగి జబ్బు రాదనే భావనను అధ్యయన ఫలితాలు తిప్పికొడుతున్నాయి. ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం, ముప్పు ఎక్కువగా గలవారిని బయటకు రాకుండా చూడటం, పరీక్షలు ముమ్మరంగా చేయటం వంటి జాగ్రత్తలు దీర్ఘకాలం పాటించక తప్పదనే విషయాన్ని ఇవి చెప్పకనే చెబుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని