జబ్బులు తెరవొద్దు!
close
Published : 07/07/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జబ్బులు తెరవొద్దు!

కరోనాకు ముందు, కరోనా తర్వాత! ఇకపై చదువుల గురించి ఇలాగే చెప్పుకోవాలి. తరగతి గదులు మూగబోయిన వేళ ఆన్‌లైన్‌ క్లాసులు మోత మోగుతున్నాయి. చదువులు మాటెలా ఉన్నా ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నాయి. వీటిపై దృష్టి సారించటం అత్యవసరమన్నది నిపుణుల సూచన.


కళ్లు భద్రం

నేటి పిల్లలు ఆగర్భ ‘టెక్కు’ టమారులు! పుట్టుకతోనే సాంకేతిక పరిజ్ఞాన తెలివితో పుడుతున్నారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబెట్లు, మొబైల్‌ ఫోన్లు, గేమ్‌ పరికరాల వాడకాన్ని మన కన్నా చాలా చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారు. ఎంతోమంది గంటల తరబడి వీటికి అతుక్కుపోవటం చూస్తూనే ఉన్నాం. లాక్‌డౌన్‌ పుణ్యమాని ఆన్‌లైన్‌ తరగతులు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అదేపనిగా స్క్రీన్ల వంక చూడటం కళ్ల మీద విపరీత ప్రభావం చూపుతుంది. ఎన్నెన్నో సమస్యలకు దారితీస్తుంది. ఆన్‌లైన్‌ తరగతులు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. అప్పటివరకైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

ఎన్నెన్నో సమస్యలు

హ్రస్వదృష్టి: సాధారణంగా మనం చదవటం, రాయటం వంటి పనులు చేసేటప్పుడు పుస్తకానికీ కంటికీ మధ్య కనీస దూరం (33 సెంటీమీటర్లు) పాటిస్తుంటాం. దీన్నే వర్కింగ్‌ డిస్టెన్స్‌ అంటాం. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చున్నప్పుడు పిల్లలు దీన్ని పట్టించుకోకపోవచ్ఛు దగ్గరగా కూర్చొని చూస్తుండొచ్ఛు ఒకవేళ కనీస దూరాన్ని పాటించినా గంటల కొద్దీ అలాగే చూడాల్సి రావొచ్ఛు ఎక్కువసేపు దగ్గరి వస్తువులను చూస్తుంటే హ్రస్వదృష్టి (మయోపియా) ముప్పు పెరుగుతుంది. అప్పటికే హ్రస్వదృష్టి గలవారికి ఇంకాస్త త్వరగానూ ముదురుతుంది.

కళ్లు పొడిబారటం: సాధారణంగా మనం నిమిషానికి 14-15 సార్లు రెప్పలను ఆడిస్తుంటాం. తదేకంగా స్క్రీన్‌ వంక చూస్తుంటే ఇది 5-7 సార్లకు పడిపోతుంది. దీంతో కన్నీరు తయారవటం తగ్గుతుంది, కనుగుడ్డు మీదుండే కన్నీటి పొర తడి ఆరుతుంది. చూపు స్పష్టంగా కనిపించటానికి కన్నీటి పొర చాలా కీలకం. ఇది తడి ఆరితే చూపు మసక బారుతుంది. కంట్లో ఏదో పడినట్టు అనిపించటం, ఎర్రబడటం, మంట, దురద వంటి సమస్యలు బయలుదేరతాయి. ఇదిలా దీర్ఘకాలం కొనసాగితే కళ్లు పొడిబారతాయి.

కళ్ల మీద ఒత్తిడి: అదేపనిగా దగ్గరి వస్తువులను చూడటం కళ్లకు మంచిది కాదు. మనం దేన్నయినా చూస్తున్నప్పుడు ఆయా దూరాలకు అనుగుణంగా చూపు కేంద్రీకృతం కావాల్సి ఉంటుంది. ఏదో కొద్దిసేపైతే ఇబ్బందేమీ ఉండదు గానీ ఎక్కువసేపు అలాగే కేంద్రీకృతమైతే చూపును నిలిపి ఉంచే సామర్థ్యం (ఫోకసింగ్‌ ఎబిలిటీ) దెబ్బతింటుంది. ఇది కళ్లను ఒత్తిడికి గురిచేస్తుంది. చూపు మసక బారటం, తలనొప్పి వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.

కండరాల సమస్యలు: ముఖానికి దగ్గరగా ఉండే వస్తువులను చూస్తున్నప్పుడు మన కళ్లు రెండూ ముక్కు వైపునకు వస్తుంటాయి (కన్వర్జెన్స్‌). అప్పుడే వస్తువు మీద చూపు కేంద్రీకృతమై స్పష్టంగా కనిపిస్తుంది. చూపు కేంద్రీకృతం కావటానికి కనుగుడ్డును కదిలించే కండరాలు తోడ్పడతాయి. ఎక్కువసేపు దగ్గరగా ఉండే దృశ్యాలను చూస్తుంటే కండరాలు మీద ఒత్తిడి పడి త్వరగా అలసిపోతాయి. దీంతో కొందరికి హఠాత్తుగా తలనొప్పి తలెత్తొచ్ఛు చూపు మసక బారొచ్ఛు ఒక వస్తువు రెండుగా కనిపించొచ్ఛు

పార్శ్వనొప్పి: తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి (మైగ్రెయిన్‌) ఉంటే కొందరు పిల్లలకూ వచ్చే అవకాశముంది. ఇలాంటి స్వభావం గల పిల్లలు చాలాసేపు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ తెరలు చూస్తుంటే పార్వ్వనొప్పి ప్రేరేపితమై తలనొప్పి, వికారం వంటివి తలెత్తొచ్ఛు

జాగ్రత్తలు తప్పనిసరి

* పిల్లలను ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తెర మీది నుంచి చూపు మళ్లించేలా చూడాలి. తర్వాత 20 అడుగుల దూరంలో ఉన్న దృశ్యాలను 20 సెకండ్ల పాటు చూడమని చెప్పాలి. దీంతో కళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది.

* కంప్యూటర్‌ తెరకు కళ్లకు మధ్య 33 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. తెర మధ్య భాగం కళ్ల ఎత్తుకు కాస్త కిందికి ఉండేలా సరిచేయాలి. స్క్రీన్‌ కాంతి మరీ ఎక్కువగా ప్రకాశిస్తుంటే కళ్లు త్వరగా అలసిపోతాయి. అందువల్ల బ్రైట్‌నెస్‌, కాంట్రాస్ట్‌ పిల్లలకు అనుగుణంగా మార్చాలి.

* దురద పెడుతుంటే చేత్తో రుద్దుకోనివ్వద్ధు చల్లటి నీటితో కళ్లను కడుక్కోమని చెప్పాలి. కళ్లు పొడిబారేవారికి చుక్కల మందు బాగా ఉపయోగపడుతుంది.

* మొబైల్‌ ఫోన్లు, ట్యాబెట్లలో ఆన్‌లైన్‌ క్లాసులు చూడనివ్వద్ధు వీటి తెర చిన్నగా ఉండటం వల్ల కంటికి దగ్గరగా పెట్టుకొని చూస్తారు. దీంతో కళ్లు త్వరగా ఒత్తిడికి లోనవుతాయి.

* పిల్లలకు చూపు సమస్యలేవైనా ఉంటే వెంటనే పరీక్ష చేయించాలి. కళ్లద్దాలు వాడుకునేలా జాగ్రత్తపడాలి. ఇప్పటికే కాంటాక్ట్‌ లెన్సులు వాడుతున్నట్టయితే ఆన్‌లైన్‌ క్లాసులు చూస్తున్నప్పుడు వాటికి బదులు కళ్లద్దాలు ధరించటమే మంచిధి.

* క్లాసులు ముగిశాక టీవీల ముందు కూలబడటం, మొబైల్‌ ఫోన్లలో గేమ్స్‌ ఆడటం వంటివి చేయకుండా చూసుకోవాలి. ఆరుబయట గడిపేలా, ఆడుకునేలా ప్రోత్సహించాలి. దీంతో హ్రస్వదృష్టి ముప్పు తగ్గుతుంది. రోజుకు కనీసం ఒకట్రెండు గంటలైనా ఆరుబయట గడిపే పిల్లలకు హ్రస్వదృష్టి ముప్పు తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండలో ఆడుకునేలా చూస్తే ఇంకా మంచిది. సూర్యరశ్మి సమక్షంలోనే మన చర్మం విటమిన్‌ డి తయారుచేసుకుంటుంది. విటమిన్‌ డి లోపంతోనూ హ్రస్వదృష్టి ముప్పు పెరుగుతుందని తెలుసుకోవాలి.


మనసూ ముఖ్యమే!

ఇల్లే బడి. కంప్యూటరే టీచర్‌. కరోనా నేపథ్యంలో చదువుల పరిస్థితి ఇలాగే మారిపోయింది. ఉద్దేశం మంచిదే అయినా ఇది మానసికంగా కొన్ని చిక్కులనూ తెచ్చిపెడుతోంది. వీటిని గుర్తించి, జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది.

మానసిక ఒత్తిడి: అందరికీ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉండాలనేమీ లేదు. ఇవి లేని పిల్లలు తరగతులు వినలేకపోతున్నామని, వివక్షకు గురవుతున్నామని మానసికంగా ఒత్తిడికి లోనవ్వచ్ఛు ఇతరుల కన్నా తాము వెనకబడిపోతున్నామనే ఆందోళనతో చితికి పోవచ్ఛు పిల్లలే కాదు, తల్లిదండ్రులూ ఒత్తిడికి గురికావొచ్ఛు వెనకబడిన కుటుంబాల్లోనే కాదు.. మధ్య తరగతి కుటుంబాల్లోనూ చాలామంది పెద్దవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన ఉండటం లేదు. పెద్ద తరగతి పిల్లలు తమకు తాము ఇంటర్‌నెట్‌ ఆన్‌ చేసి వీడియో పాఠాలు వింటుండొచ్చు, చూస్తుండొచ్ఛు చిన్న పిల్లలకు వీటి గురించి అంతగా తెలియదు. తల్లిదండ్రులు దగ్గరుండి చూపిస్తే గానీ సాధ్యం కాదు. వీటిపై అవగాహన లేకపోతే పిల్లలతో పాటు పెద్దవాళ్లూ మానసిక క్షోభకు గురయ్యే అవకాశముంది.

ఏకాగ్రత తగ్గటం: తరగతి గదిలో ఉపాధ్యాయులు ఎదురుగా ఉన్నా పిల్లలు కుదురుగా ఉండటం, శ్రద్ధగా పాఠాలు వినటం కష్టం. ఇక ఇంట్లోనే పాఠాలు.. అదీ ఆన్‌లైన్‌లో అంటే? ఏదో టీవీ కార్యక్రమం చూస్తున్నట్టే అనిపిస్తుంది. తేలిక భావం ఏర్పడుతుంది. ఏకాగ్రత, ఆసక్తి తగ్గుతాయి. మొక్కుబడి వ్యవహారంగా మారుతుంది. పిల్లలంటేనే అల్లరి పిడుగులు. అలాంటి వాళ్లు.. ముఖ్యంగా ఏకాగ్రతను దెబ్బతీసే అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య గల పిల్లలు గంటల కొద్దీ ఒక దగ్గర కూర్చోవటం అసాధ్యం. ఒకోసారి కొందరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు- నేర్చుకునే సామర్థ్యం తక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే రెండు మూడు సార్లు బోధించాల్సి ఉంటుంది. పోలికలతో అర్థం చేయించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ తరగతుల్లో ఇది సాధ్యం కాదు. ఎవరు శ్రద్ధ పెడుతున్నారో, ఎవరు అశ్రద్ధ చూపుతున్నారో ఉపాధ్యాయుడికి తెలియదు. ఇది ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలపై విపరీత ప్రభావం చూపుతుంది.

దురుపయోగం: అప్పటివరకూ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు చూడొద్దన్న తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్లే వాటిని తమ చేతికి ఇవ్వటాన్ని కొందరు పిల్లలు అవకాశంగా తీసుకోవచ్ఛు తరగతులు జరుగుతున్నప్పుడో, ముగిశాకో ఇతరత్రా వెబ్‌సైట్లు చూస్తుండొచ్ఛు ఇది క్రమంగా వ్యవసనంగానూ మారొచ్ఛు

అనుబంధాల కొరత: బడి అంటే చదువుల నిలయమే కాదు. అనుబంధాల నెలవు. మానసిక వికాసంతో జీవితంలో పైకి ఎదగటానికి తోడ్పడే సోపానం. నిజానికి పాఠం చెప్పటమంటే ఏదో వల్లె వేసినట్టు వాగుతూ పోవటం కాదు. విద్యార్థుల కళ్లలోకి చూస్తూ, వారిలో ఆసక్తిని రేకెత్తిస్తూ అవగతం చేయించటం. దీంతో పిల్లల్లోనూ ఉపాధ్యాయులపై తెలియకుండానే భయం, భక్తి, ప్రేమ, ఆప్యాయత కలుగుతాయి. పిల్లలు జీవితంలో పైకి ఎదగటానికి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల ప్రభావమే ఎక్కువ. తోటి పిల్లలతో ఆటలు, పాటలు, గొడవలు సైతం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవే. ఆన్‌లైన్‌ క్లాసులతో అలాంటి అవకాశమేదీ ఉండదు. ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేకపోవటం వల్ల పిల్లల మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది.

ఇవీ కొన్ని జాగ్రత్తలు

* ఇంట్లోనూ బడి వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రత్యేకంగా ఒక చోటును కేటాయించాలి. పిల్లల మనసు మళ్లకుండా ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఏకాగ్రత, శ్రద్ధ పెరిగేలా చేస్తాయి.

* పిల్లలు పాఠాలు వింటున్నారా? వేరే ఏవైనా వెబ్‌సైట్లు చూస్తున్నారా? అనేది ఓ కంట కనిపెడుతుండాలి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ వంటి పరికరాల్లో పేరెంట్‌ కంట్రోల్‌ను విధిగా సెట్‌ చేసుకోవాలి.

* పిల్లల వయసును బట్టి తరగతుల నిడివి ఉండేలా పాఠశాలలు జాగ్రత్త తీసుకోవాలి. మరీ సుదీర్ఘ పాఠాలైతే పిల్లల మనసుకు ఎక్కవని, అంతసేపు పిల్లలు ఒక దగ్గర కూర్చోలేరని తెలుసుకోవాలి.

* తోటి పిల్లలతో ప్రత్యక్షంగా కలవటం కుదరటం లేదు కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించుకునే వెసులుబాటు కల్పించాలి. కాకపోతే అప్పుడప్పుడూ పర్యవేక్షిస్తుండాలి.


వంగ నివ్వద్దు!

బడిలో కుర్చీ, బల్ల వంటి సౌకర్యాలుంటాయి. వీపు వెననకు ఆనించి కూర్చోవటానికి, మోచేతులు బెంచీ మీద పెట్టి పుస్తకం చదువుకోవటానికి, నోట్స్‌ రాసుకోవటానికి వీలుంటుంది. ఇళ్లల్లో ఇలాంటి ఏర్పాట్లేవీ ఉండవు. కుర్చీలో ఒరిగిపోయో, సోఫాలో వాలిపోయో ఆన్‌లైన్‌ పాఠాలు చూస్తుండొచ్ఛు ఇది వీపు, మెడ కండరాలను ఒత్తిడికి గురిచేస్తుంది. శరీర భంగిమ దెబ్బతింటుంది. వెన్ను, మెడ నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎదుగుతున్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవటం ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీటిని నివారించుకోవచ్ఛు●.

● ఇంట్లో ప్రశాంతమైన చోట పిల్లలు స్థిమితంగా కూర్చోవటానికి వీలుగా కుర్చీ, టేబుల్‌ ఏర్పాటు చేయాలి. టేబుల్‌ మీద కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ పెట్టుకొని పాఠాలు వినేలా చేస్తే శరీరం తిన్నగా ఉండటానికి తోడ్పడుతుంది. కుర్చీ మరీ చిన్నగా గానీ టేబుల్‌ మరీ ఎత్తుగా గానీ ఉండకూడదు. ఎత్తును సరిచేసుకునే కుర్చీలైతే మంచివి. వీలున్నవారు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవచ్ఛు

* కుర్చీ వెనక భాగానికి వీపు ఆనుకొని ఉండేలా చూసుకోవాలి. ఎటపడితే అటు వంగకుండా చూడాలి. అవసరమైతే పాదాల కింద దన్నుగా ఉండటానికి ఎత్తు పీట వేయాలి.

* కంప్యూటర్‌ మానిటర్‌, కీబోర్డులను పిల్లల ఎత్తుకు అనుగుణంగా అమర్చాలి. కంటికి అనుగుణంగా మానిటర్‌ దూరాన్ని, కోణాన్ని సరిచేయాలి.

* ఆన్‌లైన్‌ తరగతులకు డెస్క్‌టాప్‌ ఉత్తమం. డెస్క్‌టాప్‌ లేకపోతే ల్యాప్‌టాప్‌ ఉపయోగించుకోవచ్ఛు మొబైల్‌ ఫోన్లు, ట్యాబెట్లు అసలే వద్ధు వీటిల్లో బొమ్మ, అక్షరాలు చిన్నగా కనిపిస్తాయి. దీంతో వెన్ను ముందుకు, మెడ కిందికి వంచి చూడాల్సి వస్తుంది. ఇది మెడ, వెన్ను నొప్పులకు దారితీస్తుంది.

* మధ్యమధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు అటూఇటూ నడిచేలా చూడటం మంచిది.

* మంచం మీద కూర్చొని ఆన్‌లైన్‌ పాఠాలు వినకుండా చూడటం ముఖ్యం.●


* అదేపనిగా స్క్రీన్‌ వంక చూసేవారికి నిద్ర పట్టకపోవటం, మధ్యలో మెలకువ రావటం వంటి సమస్యలూ బయలుదేరొచ్ఛు ●

* విటమిన్‌ ఎ, విటమిన్‌ సి గల ఆహారం కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బొప్పాయి, క్యారెట్‌, పాలకూర, గుడ్ల వంటి పండ్లు, కూరగాయలు ఇవ్వటం మంచిది.●

* ఏమాత్రం లేవకుండా గంటల కొద్దీ అలాగే కూర్చోవటం వల్ల దీర్ఘకాలంలో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలూ తలెత్తొచ్ఛు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని