పిల్లల తగాదాలు మీదాకా వస్తే..?
close
Published : 05/08/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల తగాదాలు మీదాకా వస్తే..?

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు... గిల్లికజ్జాలు షరామామూలే. అలాగని వారి ప్రతి గొడవల్లోనూ పెద్దలుగా మీరు వెళ్లి తగవులు తీర్చేద్దాం అనుకుంటున్నారా? ఆగండి...

కొందరు చిన్నారులు తమ వస్తువుల్ని దాచుకుని ఎదుటివారివి వాడేయడమో పాడు చేయడమో చేస్తుంటారు. ఇలాంటప్పుడు పాపం చిన్నోడు కదా ఇచ్చేయ్‌ అనో...నీకంటే పెద్దది కదా తనని వాడుకోనివ్వు అనో సలహా ఇవ్వొద్ధు ఎందుకంటే ప్రతిసారీ దాన్నే వారు అనుసరించే అవకాశం ఉంది. అలాకాకుండా...ఎవరి వస్తువుల్ని వారు జాగ్రత్త చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఎదుటివారితో పంచుకోవడం కూడా ముఖ్యమే అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ అక్కది పాడైతే ఒకదానితోనే ఇద్దరూ సర్దుబాటు చేసుకోవాలని చెప్పండి. అప్పుడు వారు సరైన దిశగా ఆలోచించగలుగుతారు.

* పిల్లలు మీతో ఏదైనా విషయం పంచుకోవాలనుకున్నప్పుడు ఇద్దరి వాదనలూ ఒకేసారి వినే ప్రయత్నం చేయొద్ధు అలా చేస్తే ఎవరు కాస్త దూకుడుగా ఉంటారో, బలంగా ఉంటారో వారి మాటే నిలబడుతుంది. అలాకాకుండా విడివిడిగా సమయం కేటాయించి వినండి. ఎవరిది తప్పో మీకు తెలుస్తుంది. చిన్నారుల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మీరు కలగచేసుకుని తప్పొప్పుల నిర్ధారణ చేసే బదులు... చిన్న తగాదాలయితే వాళ్లనే పరిష్కరించుకోమనండి. ఇలా చేయడం వల్ల ఎదిగే కొద్దీ వారిలో బాధ్యత, అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని