ఊపిరితిత్తుల ఆరోగ్యానికి...
close
Published : 10/08/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి...

ఈకాలంలో వచ్చే ఇబ్బందులతోపాటు శ్వాస సంబంధిత సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే వాల్‌నట్స్‌ను తినొచ్ఛు దీని ద్వారా ఎక్కువ పోషకాలనూ పొందవచ్ఛు

వీటిల్లో విటమిన్లు, కెలొరీలు, ఫైబర్‌, ప్రొటీన్లతోపాటు కాపర్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాలు నిండుగా ఉంటాయి.

* ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి సమస్యల బారి నుంచి బయటపడవచ్ఛు

* వీటిని ‘బ్రెయిన్‌ ఫుడ్‌గా’ చెబుతారు. అలాగే క్యాన్సర్‌ కారకాలు శరీరంలో వృద్ధిచెందకుండా నిరోధిస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

* రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. మధుమేహ బాధితులు వీటిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

* ఇవి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అవయవాలకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తాయి.

* రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అధిక రక్తపోటుతో ఇబ్బందిపడేవారు వీటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

* ఇవి శరీరంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* వీటిలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-బి, సి శరీరాన్ని ఫ్రీరాడికల్స్‌ బారి నుంచి కాపాడతాయి.

* చర్మారోగ్యాన్నీ కాపాడటమే కాకుండా వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలనూ ఇవి అరికడతాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని