ఆయుర్వేద స్నానం చేయండిలా...
close
Published : 15/08/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయుర్వేద స్నానం చేయండిలా...

పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తాం. కానీ శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఏ కాస్త సమయం చిక్కినా.. నిదానంగా ఆ పని చేయండి. ఆ తరువాత ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో వీటిని కలిపితే మరింత హాయి.

నీళ్లలో కాస్త గంధం పొడి, కాసిన్ని మల్లెలు లేదా గూలాబీలు వేసుకుని స్నానం చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు లేదా నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే మనసు తేలికపడుతుంది. వేడినీళ్లలో కాస్త పసుపు, వేపాకులు వేసుకుని చేస్తే నీళ్లలోని క్రిములు నశిస్తాయి.

మచ్చలు తగ్గిపోతాయి...

ముఖం మీద మచ్చలు మాయం కావడానికి ఆయుర్వేద పొడి చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది. అదే.. ఉబ్తాన్‌. దీన్నే ఉద్దవర్తానం అనికూడా అంటారు.

గోధుమపిండి, ఓట్స్‌ను సమాన పరిమాణంలో తీసుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా మీగడ, కొంచెం కొబ్బరినూనె, కలబంద గుజ్జు వేయాలి. ఈ మిశ్రమాన్ని గులాబీనీటితో కలపాలి. దీన్ని ఒంటికి రాసుకుని ఆరేంతవరకు ఉంచి చేతిని తడిచేసుకుంటూ మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల అవాంఛిత రోమాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని