ఇంట్లోనే... పెడిక్యూర్‌
close
Published : 29/08/2020 00:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోనే... పెడిక్యూర్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... బ్యూటీపార్లర్‌కి వెళ్లాలంటే తెలియని భయం. అందుకే సులువుగా ఇంట్లోనే పాదాలను కోమలంగా మార్చుకునే ఐదు అంచెలు ఇవి..

పెడిక్యూర్‌ చేయడానికి ముందు గోళ్లను శుభ్రంగా, చక్కటి ఆకృతిలో కత్తిరించుకోవాలి. మరోసారి గోళ్లను ట్రిమ్‌ చేసుకోవాలి. కాస్త ఆముదంలో కర్పూరం కలిపి కాళ్లకు రాసుకుని బాగా మర్దన చేయాలి.

* ఓ పెద్ద టబ్‌ని తీసుకుని దాన్ని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. అందులో ఓ గుప్పెడు రోజ్‌ బాత్‌ సాల్ట్‌ని వేయండి. దాంతోపాటు రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌నీ వేస్తే మంచి అరోమాతోపాటు పాదాలూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఓ ఇరవై నిమిషాలు అందులో మీ పాదాలను ఉంచండి. బయటకు తీశాక పొడి టవల్‌తో శుభ్రంగా తుడవండి.

* మార్కెట్‌లో క్యూటికల్‌ క్రీమ్‌ దొరుకుతుంది. దాన్ని ప్రతి గోరుపైనా రాసుకోవాలి. లేదంటే కాస్త బాదం నూనెను రాసుకున్నా సరే! అలా ఓ పదినిమిషాలు వదిలేయండి. మరోపక్క పంచదార, బాదం పొడి, కలబంద గుజ్జు కలిపి ఆ మిశ్రమంతో పాదాలపై మెల్లగా రుద్దండి. ఇది మృతకణాలను తొలగించి మృదువుగా మారుస్తుంది.

* స్క్రబ్‌ చేయడం పూర్తయ్యాక కాళ్లను కడిగి పాదాలకు మాయిశ్చరైజర్‌ రాయాలి. ఫలితంగా పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. పగుళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. చివరగా రెగ్యులర్‌గా మీరు పాదాలకు వాడే ఫుట్‌క్రీమ్‌ను అరికాళ్ల నుంచి పై వరకూ రాసి సవ్య, అపసవ్య దశల్లో రుద్దండి. ఇలా చేస్తే కండరాలు రిలాక్స్‌ అవుతాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని