ఇంట్లోనే టోనర్‌ తయారీ
close
Published : 03/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంట్లోనే టోనర్‌ తయారీ

ముఖానికి ఎన్ని లేపనాలు రాసినా కొందరి చర్మం జిడ్డుగానే ఉంటుంది. వీరు మాయిశ్చరైజర్‌కి బదులు టోనర్‌ను వినియోగించడం మంచిది. దీన్ని సహజంగానే ఇంట్లో తయారు చేసుకోవచ్ఛు అదెలాగంటే...

బియ్యం-గ్రీన్‌టీ తో...: అరకప్పు గ్రీన్‌టీ డికాక్షన్‌లో రెండు టేబుల్‌స్పూన్లు శుభ్రం చేసిన బియ్యాన్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం దీన్ని వడకట్టుకోవాలి. ఈ టోనర్‌ని ముఖానికి రాసుకుని ఆరాక మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇందులోని బియ్యం నీళ్లు, గ్రీన్‌టీల్లోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌తో: రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ని తీసుకోవాలి. ఇందులో రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలపాలి. ఆపై ఈ మిశ్రమంలో ముంచిన కాటన్‌ ప్యాడ్‌తో ముఖాన్ని అద్దుకోవాలి. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ చర్మ రంధ్రాల్లోని మురికీ, జిడ్డును తేలిగ్గా శుభ్రపరుస్తుంది. ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ చర్మాన్ని బిగుతుగా ఉంచి మెరిసేలా చేస్తాయి. అలాగే ఈ టోనర్‌ చర్మం పీహెచ్‌ స్థాయులను సమం చేస్తుంది.

కలబంద-కీరదోస రసంతో : రెండు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జులో చెంచా కీరదోస రసాన్ని కలపాలి. దీనిలో ముంచిన కాటన్‌ ప్యాడ్‌తో ముఖాన్ని తుడవాలి. ఈ మిశ్రమం చర్మంపై మురికిని తొలగించి శుభ్రం చేస్తుంది. పైగా తేమనూ కోల్పోనివ్వదు. సూర్యకిరణాల ప్రభావం నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని