సంతోషం చెరో సగం!
close
Updated : 04/09/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంతోషం చెరో సగం!

భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన, సంతోషదాయకమైన బంధం ఏర్పడాలంటే... ఒకరిమీద మరొకరికి నమ్మకం, గౌరవం, భద్రత, అవగాహన, సర్దుకుపోయే తత్వం వంటివి ఉండాలి. అప్పుడే వారి మధ్య బంధం దృఢంగా ఉంటుంది. వీటితోపాటు మరికొన్ని అంశాలు ఆలుమగల అనుబంధాన్ని మరింత పదిలపరచడానికి అవసరమవుతాయి. అవేంటో చూద్దాం..

ప్రతి వ్యక్తిలోనూ లోపాలుంటాయి. వాటిని యథాతథంగా అంగీకరించగలగాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరుగా ప్రేమించుకోండి. అప్పుడే మీ భాగస్వామినీ ప్రేమించగలుగుతారు. భార్యభర్తలిద్దరి మధ్య దూరం పెరిగితే అభద్రతా, అపోహలూ, అపార్థాలూ పెరిగే ప్రమాదం ఉంది. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒకరికొకరు అన్నట్లు ఉండేందుకు ప్రయత్నించండి. వీలైనంత వరకూ కలిసి పనిచేయడం, చిన్న చిన్న సంతోషాలు పంచుకోవడం వంటివన్నీ మీ ప్రేమబంధాన్ని బలపరుస్తాయి.

*● ఏ బంధం అయినా నమ్మకం అనే పునాది మీదే నిలబడుతుంది. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా నిజాయతీగా వ్యవహరించాలి. పారదర్శకంగా ఉన్నప్పుడు....ఏవైనా సమస్యలు వచ్చినా కష్టం/నష్టం కలిగించవు. అందుకే నాదీ, నీదీ అని కాకుండా మనం అనే మాటకు విలువ ఇచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు.

* బంధం ఆరోగ్యకరమైన వాతారణంలో హాయిగా సాగిపోవాలంటే...ఎదుటివారిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. వారి అవసరాలూ, కోరికలూ, ఆసక్తులకు అనుగుణంగా అవసరమైన మార్పులూ చేసుకోండి. వీటిని మీరు ఇష్టంగా అంగీకరిస్తే మీ జీవితం సంతోషమయం అవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని