అన్నం తింటే షుగర్‌ వస్తుందా?
close
Published : 09/09/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నం తింటే షుగర్‌ వస్తుందా?

నా వయసు నలభై మూడేళ్లు. ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 78 కిలోలు. రోజూ మూడు పూటలా అన్నమే తింటా. అయితే ఇలా అన్నం తింటే షుగరు వస్తుందని అంటున్నారు. నిజమేనా? షుగరు రాకుండా ఉండటానికి ఏం చేయాలి? రాత్రిపూట అన్నానికి బదులుగా ఏం తినాలి?

- ఓ సోదరి

అన్నం తింటే షుగర్‌ వస్తుందనేది అపోహ మాత్రమే.మనం తీసుకునే ఆహారం మోతాదును బట్టి మధుమేహం వస్తుంది. బాగా పాలిష్‌ చేసిన బియ్యంతో పాటూ బ్రౌన్‌రైస్‌, చపాతీ, తృణధాన్యాలు..వంటివి ఏవి మోతాదుకు మించి రోజూ తింటున్నా ఈ పరిస్థితి ఎదురుకావొచ్ఛు చక్కెర వ్యాధి రావడానికి కేవలం ఆహారపుటలవాట్లు మాత్రమే కారణం కాదు... కుటుంబ చరిత్ర. జీవన శైలి, అధిక బరువు, పెరిగే వయసు వంటివన్నీ మూలాలే. ఏళ్లు గడిచే కొద్దీ శరీర జీవ క్రియల వేగం తగ్గుతుంది. దాంతో శరీరంలో పలు మార్పులు వస్తాయి. ఈ సమస్యలు అన్నీ ఉంటే చక్కెర వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగని డయాబెటిస్‌ వస్తుందనీ కచ్చితంగా చెప్పలేం. కాకపోతే వాటికి తోడు సరైన ఆహారపుటలవాట్లు లేనప్పుడు ఈ ముప్పును తప్పనిసరిగా ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఎత్తూ, వయసు ప్రకారం మీరు ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉన్నారు. దీనికి తోడు మీరు ఇలా మూడు పూటలా అన్నం అధికమొత్తంలో తీసుకుంటూ ఉంటే షుగర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నమే తినాలని అనుకుంటే దాంతోపాటు తాజా కాయగూరలను తీసుకోవాలి. కప్పు అన్నానికి సమానంగా కప్పు ఉడికించిన కూరగాయల ముక్కలను తీసుకోవాలి. లేదా సలాడ్‌గానూ తినొచ్ఛు మీ బరువుకి తగ్గ ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకున్నప్పుడు ఈ ఇబ్బందిని అధిగమించొచ్ఛు అన్నానికి ప్రత్యామ్నాయంగా కొర్రలు, సజ్జలు, రాగులు, ఊదలను ఆహారంలో చేర్చుకోవచ్ఛు అయితే ఎంత రైస్‌ తీసుకుంటున్నారో అంతే పరిమాణంలో వీటిని తీసుకుంటే ఫలితమేమీ ఉండదు. మితంగా తీసుకున్నా త్వరగా ఆకలి వేయదు. అన్నంతో పోలిస్తే వీటిలో పీచు, సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటినీ ఎంచుకోవచ్ఛు

భవిష్యత్తులో డయాబెటిస్‌ రాకుండా సమతులాహారాన్ని ఎంచుకోవాలి. వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పోషకాల కాయగూరలు, శక్తినిచ్చే పప్పులను మీ డైట్‌లో చేర్చుకోవాలి. మాంసాహారులైతే రోజూ గుడ్డులోని తెల్లసొన, చికెన్‌ కొద్ది మొత్తంలో తీసుకోవచ్ఛు రాత్రిపూట చపాతీలు, జొన్నరొట్టెలు, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా... వంటివి తినొచ్ఛు వీటిని కేవలం రాత్రే తినాలనేం లేదు. మూడు పూటల్లో ఎప్పుడు తీసుకున్నా ఫరవాలేదు. ఓసారి మీరు పోషకాహార నిపుణుల సలహా తీసుకుంటే మేలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని