నవ్వుల్‌.. నవ్వుల్‌..
close
Published : 22/09/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వుల్‌.. నవ్వుల్‌..

అమ్మ: అదేంటి.. బంటీ ఫోన్‌ అలా నేలకేసి కొట్టావ్‌?!

బంటి: నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఒక ఫోన్‌ కొట్టమని నా ఫ్రెండ్‌ చింటు నాకు చెప్పాడు మమ్మీ.. అందుకని!!

నాన్న: ఏరా.. టింకూ.. చీటీ పట్టుకెళ్లి సరకులు తీసుకురమ్మంటే గీతలు గీస్తున్నావేంటి?

టింకు: మీరే కదా నాన్నా.. ఏ పని చేసినా ఒక ప్లాన్‌ ప్రకారం పక్కాగా చేయాలంటారు. అందుకే ప్లాన్‌ గీస్తున్నా!!

టీచర్‌: లిల్లీ ఏంటి ఆన్‌లైన్‌ క్లాసులోనూ అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌?

లిల్లి: ఏం లేదు టీచర్‌! ఈ కరోనా సమయంలో ఎవరితోనూ కరచాలనం చేయవద్దని ఒక పక్క జాగ్రత్తలు చెబుతూనే మరో పక్క ‘కరోనాతో యుద్ధానికి అందరూ చేతులు కలపండి’ అంటున్నారు. ఇందులో ఏది పాటించాలా? అని ఆలోచిస్తున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

- రామిజిన్ని. టీనా, విజయనగరం

email: hb.eenadu@gmail.comమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని