తమాషా ప్రశ్నలు
close
Published : 24/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమాషా ప్రశ్నలు

1. కప్పల్ని తినలేని పాము?
2. చేదుగా లేకున్నా చేదు అని దేన్ని అంటారు?
3. తల తిరిగేది ఎప్పుడు?


వాక్యాల్లో వ్యక్తులు!

ఇక్కడున్న వాక్యాల్లో కొందరి పేర్లు దాగున్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోట చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?
1. ఇటు రా.. ఈ మువ్వలు దాచిపెట్టు  
2. అక్కడ.. వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి.. నడువు త్వరగా..  
3. ‘సులభంగా డబ్బు సంపాదించాలంటే..’ ఇలాంటి ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని తాత చెప్పాడు.  
4. మౌనంగా ఉండటం నిన్ను చూసి నేర్చుకోవాలిక!  
5. సురక్షిత మార్గాలు నీకు తెలియక ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు.


మెదడుకు మేత

ఇక్కడి అంకెల వరుస క్రమాల ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.
1 100, 97.25, 91.75, 83.5, ?
2 0, 1, 3, 6, 7, 9, 12, 13, 15, 18, ?, ?, ?

 


క్విజ్‌.. క్విజ్‌

1. మనుషులకు ఎన్ని దంతాలు ఉంటాయి?
2. ఆక్టోపస్‌ ఎన్ని చేతులు కలిగి ఉంటుంది?
3. ప్రపంచంలో దాదాపు ప్రతిచోట కనిపించే పక్షి ఏంటి?
4. నీలి రంగు నాలుక కలిగి ఉంటే కుక్క జాతి ఏది?
5. పాములు ఏ శరీర భాగంతో వాసనను పసిగడతాయి?


రంగులు వేద్దామా..

 కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


జవాబులు

వాక్యాల్లో వ్యక్తులు: 1.రాము  2. అర్చన  3. సుజాత 4.మౌనిక 5.సునీత

కవలలేవి: 1,

3 క్విజ్‌.. క్విజ్‌: 1.32  2.8 3.కోడి 4.చౌచౌ 5.నాలుక మెదడుకు మేత: 1. 72.5 (ముందు అంకెలోంచి తీసేయాల్సిన మొత్తం ప్రతిసారి 2.75 చొప్పున పెరుగుతుంది.) 2. 19, 21, 24 (ప్రశ్నలో ఇచ్చిన వరుస +1, +2, +3  క్రమంలో ఉంది.)

తమాషా ప్రశ్నలు: 1.వానపాము 2. బావిలో నీటిని 3. మనం తిప్పినప్పుడు

చెప్పుకోండి చూద్దాం: 1.చెట్టు 2.కుందేలు 3.పశువుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని