అమ్మఉద్యోగానికి వెళ్తే..
close
Published : 26/09/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మఉద్యోగానికి వెళ్తే..

అమ్మ ఇంట్లోనే ఉంటే పిల్లలకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఏదైనాసరే అమ్మ చూసుకుంటుందనే భరోసాతో ఉంటారు. కానీ తల్లి ఉద్యోగం చేస్తుంటే... ఎంత శ్రద్ధ తీసుకున్నా ఏదో వెలితి వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆ బెంగ తీరాలంటే... వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించాలి.

బాధ్యత ఇవ్వాలి: ఏ చిన్న అవసరం వచ్చినా కొంతమంది పిల్లలు అమ్మకు పదేపదే ఫోన్లు చేసి విసిగిస్తుంటారు. అందుకే వారికి అవసరమయ్యే వస్తువులు ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయో చూపించాలి. వాటిని వీలైనంతవరకూ అందుబాటులో ఉండేలా పెట్టాలి. కొన్ని ఇంటి బాధ్యతలూ అప్పగించాలి. ఫలానా సమయానికి నీళ్లు ఆన్‌ చేయి... వచ్చేసరికల్లా ఫలానా పని పూర్తి చేయి అంటూ చెప్పండి. దీనివల్ల వారికి బాధ్యతలు అలవడతాయి.

పద్ధతిగా: సమయపాలన పాటిస్తూ పనులను పూర్తి చేసేలా పిల్లలను తీర్చిదిద్దాలి. ఆటలాడుతూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా సక్రమంగా పనులు పూర్తి చేసేలా చూడాలి. అవసరమైతే ఏ సమయానికి ఏ పని చేయాలో రాసి ఇవ్వడం కూడా మంచిదే.

హాయిగా గడిచేలా: పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నా...బోర్‌ కొట్టకుండా, ఇతర ఆలోచనలు రాకుండా చేతినిండా పని ఉండేలా చేయండి. అది కచ్చితంగా వారు ఇష్టంతో చేసేవి అయ్యి ఉండాలి. వీలైనంతవరకూ ఆ సమయంలో ఆన్‌లైన్‌లో పెయింటింగ్‌ క్లాస్‌, మ్యూజిక్‌ తరగతి వంటివి ఉండేలా చేస్తే సరి. సమయం ఇట్టే గడిచిపోతుంది. వారూ ఇబ్బందిగా ఫీలవ్వరు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని