ఓటమిని తట్టుకునేలా...
close
Published : 28/09/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటమిని తట్టుకునేలా...

చదువు, ఆటపాటలకు సంబంధించిన పోటీల్లో తమ పిల్లలే విజేతలుగా నిలవాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే పోటీ అంటే.. కేవలం గెలుపు మాత్రమే కాదు.. దాని వెనకే ఓటమీ ఉంటుంది. దాన్ని జీర్ణించుకోలేని పిల్లలు ఎంతో బాధపడిపోతుంటారు. అలాంటప్పుడు తల్లిగా మీరిలా చేయొచ్చు.

ప్రోత్సహించాలి: గెలుపోటములు లేనిదే జీవితం లేదు. ఫలితం కంటే ముందు...పది మందితో కలసి పోటీ పడటమే గొప్ప విషయమని పిల్లలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ఓటమి ఎదురైనా తిరిగి బలాన్ని పుంజుకుని గెలుపుబాట పట్టగలిగే ధైర్యాన్ని వారికి నూరిపోయాలి. అనుకున్న లక్ష్యం చేరుకునేవరకూ ప్రయత్నలోపం ఉండకూడదని స్ఫూర్తి రగిలించాలి.

నిరంతర ప్రక్రియ : నేర్చుకోవడమనేది ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. ఓడిపోయినప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తీ సన్నగిల్లుతుంది. అలా జరగకుండా పిల్లల్లో కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే తపన పెరిగేలా చేయాలి. అందుకు పెద్దవాళ్లు అన్ని విధాలుగా సాయపడాలి.

అనుభవం: నిజానికి ఓటమి విలువైన పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. వాటి నుంచి నేర్చుకుని తిరిగి అవే తప్పులు చేయకుండా ఉంటే సరిపోతుంది. గెలుపోటములను చిన్న విషయాలుగానే చూసి ముందుకు వెళ్లేలా చేయాలి. అవసరమైతే చిన్నతనంలో మీరు ఓడిన సందర్భాల గురించీ చెప్పాలి. అప్పుడు ఇలా ఓదార్చేవాళ్లూ లేక మీరు ఎంతగా ఇబ్బందిపడిందీ వివరించాలి. దాంతో పిల్లల ప్రవర్తనలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని