ఏడాది దాటినా పళ్లు రాలేదేం?
close
Updated : 29/09/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాది దాటినా పళ్లు రాలేదేం?

సమస్య-సలహా

సమస్య: మా మొదటి అమ్మాయికి 7 నెలలకే పాల పళ్లు వచ్చాయి. రెండో పాపకు ఏడాది అయినా ఇంకా పళ్లు మొలవలేదు. ఇదేమైనా సమస్యా? ఏదైనా చికిత్స అవసరమా?

- నాగేశ్‌, హైదరాబాద్‌

సలహా: పిల్లలు పుట్టే సమయానికే చిగుళ్ల లోపల దంతాలు ఏర్పడి ఉంటాయి. సాధారణంగా ఇవి 6 నెలల వయసులో నెమ్మదిగా మొలవటం మొదలవుతుంది. వీటినే పాల పళ్లు అంటాం. ఆరంభంలో ముందు పళ్లు మొలుస్తాయి. అయితే కొందరు పిల్లలకు పళ్లు ఆలస్యంగా రావొచ్ఛు దీనికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్ఛు కొందరికి వంశ పారంపర్యంగా పళ్లు రావటం ఆలస్యం కావొచ్ఛు మీ మొదటి అమ్మాయికి 6 నెలలకే పళ్లు వచ్చాయని అంటున్నారంటే ఇది కారణం కాకపోవచ్ఛు నెలలు నిండకుండా పుట్టటం, తక్కువ బరువుతో పుట్టటం వంటివీ పళ్లు ఆలస్యంగా మొలవటానికి కారణం కావొచ్ఛు ఇలాంటి విషయాలను మీరు తెలపలేదు. ఏదేమైనా 15 నెలల వయసు వచ్చేవరకు పాల పళ్లు రావటాన్ని సహజంగానే పరిగణించాల్సి ఉంటుంది. మీ పాప వయసు ఏడాదే కాబట్టి మరో 2, 3 నెలల వరకు సమయం ఉందనే అనుకోవచ్ఛు ఆలస్యంగా పళ్లు రావటం సమస్యేమీ కాదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో 2, 3 నెలలు వేచి చూడండి. చిగుళ్ల మీద వేలు పెట్టి చూస్తుంటే పళ్లు వస్తున్న విషయం తెలుస్తుంది. నెమ్మదిగా రుద్దుతూ కాస్త మర్దన చేస్తూ ఉంటే పళ్లు త్వరగా రావటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 18 నెలలు దాటినా పళ్లు అసలే రాకపోతే ఒకసారి దంత వైద్యుడికి చూపించండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని